Air India urination case: ‘‘నేను మూత్రం పోయలేదు.. తనే పోసుకుంది’’
Air India urination case: ఎయిర్ ఇండియా (Air India) విమానంలో సహ ప్రయాణికురాలైన ఒక వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా (Shankar Mishra) కొత్త వాదనకు తెర తీశాడు.
Air India urination case: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా (Air India) ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్న ఒక వృద్ధురాలిపై సహప్రయాణికుడు శంకర్ మిశ్రా (Shankar Mishra) మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Air India urination case: నేను మూత్రం పోయలేదు..
ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో సహ ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఆరోపణలు (Air India urination case) ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా (Shankar Mishra).. ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నాడు. అతడి బెయిల్ పిటిషన్ ను ఢిల్లీలోని స్థానిక సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో అతడిని ప్రశ్నించాల్సి ఉందని, అందవల్ల తమ కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. పోలీసుల అభ్యర్థనపై కోర్టు ఇచ్చిన నోటీసుకు శుక్రవారం శంకర్ మిశ్రా (Shankar Mishra) స్పందించాడు. కోర్టులో వింత వాదనకు తెరతీశాడు. తాను అసలు ఆమెపై మూత్రం పోయలేదని, ఆమే తనపై తానే పోసుకుందని వింత వాదన ప్రారంభించాడు. ఈ మేరకు శంకర్ మిశ్రా (Shankar Mishra) తరఫు న్యాయవాది రమేశ్ గుప్తా కోర్టుకు తెలిపాడు. ‘‘విమానంలో ఆమె కూర్చున్న సీటు మధ్యలో ఉంది. ఆ సీటు వద్దకు శంకర్ మిశ్రా వెళ్లే అవకాశమే లేదు. ఆమెకు మూత్రంపై స్వీయ నియంత్రణ లేదు. మూత్రాన్ని ఆపుకోలేని సమస్యతో ఆమె బాధ పడ్తున్నారు. ఆమె కథక్ డ్యాన్సర్. 80% కథక్ నాట్య కళాకారిణుల్లో ఈ సమస్య ఉంటుంది’’ అని ఆయన కోర్టులో వాదించాడు.
Air India urination case: జడ్జి అభ్యంతరం
శంకర్ మిశ్రా తరఫు న్యాయవాది వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. తాను కూడా విమానాల్లో ప్రయాణించానని, ఏ సీటు వద్దకు ఎవరైనా వెళ్లే వీలు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇదే న్యాయవాది గతంలో శంకర్ మిశ్రాకు బెయిల్ కోరుతూ వాదిస్తున్న సమయంలో.. మద్యం మత్తులో శంకర్ మిశ్రా (Shankar Mishra) ఆ ఘటనకు పాల్పడ్డాడని, ఆ చర్య వెనుక ఎలాంటి లైంగిక ఆసక్తి లేదని వివరించడం గమనార్హం. ఇప్పుడు సడెన్ గా ప్లేట్ ఫిరాయించి, కొత్త వాదనను తెరపైకి తెచ్చాడు. అయితే, శంకర్ మిశ్రా (Shankar Mishra) ఆమెపై మూత్రం పోసాడని నిర్ధారించే సాక్ష్యాధారాలు చాలా ఉన్నాయి. తను స్వయంగా బాధితురాలితో చేసిన వాట్సాప్ చాట్ లోనూ ఆ విషయం స్పష్టంగా ఉంది.