Sabarimala temple opens: శబరిమల అయ్యప్ప ఆలయంలో చింగం పూజలు
Sabarimala temple opens: చింగం పూజల కోసం శబరిమల ఆలయం తెరుచుకుంది.
శబరిమల, ఆగస్టు 17: మలయాళంలోని పవిత్రమైన చింగం నెలలో ఐదు రోజుల నెలవారీ పూజల నిర్వహణ కోసం శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకోవడంతో భక్తుల రద్దీ ప్రారంభమైంది.
మంగళవారం సాయంత్రం తంత్రి (ప్రధాన పూజారి) కందారి రాజీవరు ఆధ్వర్యంలో ప్రధాన పూజారి ఎన్.పరమేశ్వరన్ నంబూద్రి గర్భగుడి ముఖద్వారాన్ని తెరిచి దీపాన్ని వెలిగించారు.
అనంతరం ఇతర దేవతల ఆలయాల ముఖద్వారాలను కూడా తెరిచి పూజారులు దీపాలు వెలిగించారు. సాంప్రదాయాలు, ఆచారాలు పాటించిన తరువాత పవిత్ర కొండపైకి వెళ్లడానికి భక్తులను అనుమతించారు. 18 పవిత్రమైన మెట్లను అధిరోహించడానికి, ప్రధాన దైవం అయ్యప్ప ముందు ప్రార్థనలు చేయడానికి భక్తులను అనుమతించారు.
ఆగస్ట్ 21 వరకు అయ్యప్ప మందిరం తెరిచి ఉంటుంది. భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆలయాన్ని సందర్శించవచ్చని ఆలయ నిర్వాహకులు తెలిపారు. యాత్రికుల కోసం బేస్ క్యాంపు అయిన నిలక్కల్ వద్ద స్పాట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ కూడా ఉంది.
తెలుగు రాష్ట్రాల నుంచి అయ్పప్ప భక్తులు నవంబరు, డిసెంబరు, జనవరి మాసాల్లో శబరిమల సందర్శిస్తారు. అయ్యప్ప దీక్ష ధరించి భక్తిశ్రద్ధలతో అయ్యప్పను పూజిస్తారు.
టాపిక్