Rupee falls: 9 పైసలు క్షీణించిన రూపాయి.. మళ్లీ అల్‌టైమ్ కనిష్టం దిశగా..-rupee falls 9 paise to 79 71 against us dollar in early trade ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rupee Falls: 9 పైసలు క్షీణించిన రూపాయి.. మళ్లీ అల్‌టైమ్ కనిష్టం దిశగా..

Rupee falls: 9 పైసలు క్షీణించిన రూపాయి.. మళ్లీ అల్‌టైమ్ కనిష్టం దిశగా..

Praveen Kumar Lenkala HT Telugu
Aug 12, 2022 10:15 AM IST

Rupee falls: రూపాయి విలువ వరుసగా రెండో రోజూ పతనాన్ని ఎదుర్కొంటోంది.

<p>మళ్లీ ఆల్‌టైమ్ కనిష్టం దిశగా రూపాయి విలువ</p>
<p>మళ్లీ ఆల్‌టైమ్ కనిష్టం దిశగా రూపాయి విలువ</p> (PTI)

ముంబై, ఆగస్టు 12: శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు క్షీణించి 79.71 వద్దకు చేరుకుంది. విదేశీ మార్కెట్‌లో అమెరికన్ కరెన్సీ బలం పుంజుకోవడం, పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా రూపాయి విలువ క్షీణించింది.

ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ వద్ద రూపాయి యూఎస్ డాలర్‌తో పోలిస్తే 79.67 వద్ద ప్రారంభమైంది. క్రితం ముగింపుతో పోలిస్తే 9 పైసల క్షీణతను నమోదు చేస్తూ 79.71 వద్ద ట్రేడవుతోంది. గురువారం అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 37 పైసలు క్షీణించి 79.62 వద్ద ముగిసింది.

ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ట్రెజరీ హెడ్ అనిల్ కుమార్ భన్సాలీ దీనిని విశ్లేషిస్తూ.. డాలర్ ఇండెక్స్ పతనం, ఆసియా కరెన్సీల పెరుగుదల ఉన్నప్పటికీ.. ప్రభుత్వం, రక్షణ, చమురు కంపెనీలు యూఎస్ డాలర్‌ను భారీగా కొనుగోలు చేయడంతో గురువారం భారత రూపాయి క్షీణించిందని వివరించారు.

‘వచ్చే వారంలో సెలవులు ఉన్నందున డిమాండ్ శుక్రవారం కొనసాగవచ్చు. ఈ రోజు 79.40 నుండి 79.80 మధ్య ట్రేడవ్వొచ్చు..’ అని భన్సాలీ చెప్పారు. అయితే చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల సమీపంలో ఉన్నాయి.

ఆరు కరెన్సీల బాస్కెట్‌తో డాలర్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.11 శాతం పెరిగి 105.20కి చేరుకుంది. ఇక గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.48 శాతం క్షీణించి 99.12 డాలర్లకు చేరుకుంది.

దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో సెన్సెక్స్ 189.59 పాయింట్లు (0.32 శాతం) క్షీణించి 59,143.01 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 42.75 పాయింట్లు (0.24 శాతం) క్షీణించి 17,616.25 వద్ద కొనసాగుతోంది.

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గురువారం క్యాపిటల్ మార్కెట్‌లో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం రూ. 2,298.08 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.