2 నెలల గరిష్ఠానికి చమురు ధరలు.. బ్యారెల్‌కు 120 డాలర్లు-oil prices climb to over 2 month highs ahead of eu meeting on russia sanctions ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Oil Prices Climb To Over 2-month Highs Ahead Of Eu Meeting On Russia Sanctions

2 నెలల గరిష్ఠానికి చమురు ధరలు.. బ్యారెల్‌కు 120 డాలర్లు

HT Telugu Desk HT Telugu
May 30, 2022 03:33 PM IST

చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో రెండు నెలల గరిష్ఠాన్ని తాకాయి.

ఈయూ సంస్థల ముందు ఉక్రెయిన్ నిరసనకారుల ప్రదర్శనలు.. రష్యన్ చమురుపై నిషేధం విధించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం
ఈయూ సంస్థల ముందు ఉక్రెయిన్ నిరసనకారుల ప్రదర్శనలు.. రష్యన్ చమురుపై నిషేధం విధించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం (AP)

లండన్: అంతర్జాతీయ చమురు ధరలు సోమవారం రెండు నెలల గరిష్ఠాన్ని తాకాయి. రష్యన్ చమురు దిగుమతుల నిషేధంపై ఒప్పందానికి వచ్చేందుకు వీలుగా జరగనున్న యురోపియన్ యూనియన్ సమావేశం వైపు ట్రేడర్లు చూస్తున్నారు.

బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ జూలై కాంట్రాక్ట్ మంగళవారం ఎక్స్‌పైరీ కానుంది. సోమవారం బ్యారెల్ ధర 54 సెంట్లు పెరిగి 119.97 డాలర్ల వద్ద ఉంది. ఆగస్టు బ్రెంట్ కాంట్రాక్ట్ మరింత క్రియాశీలకంగా 69 సెంట్లు పెరిగి 116.25 వద్ద ఉంది.

గత వారపు లాభాలకు కొనసాగింపుగా యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ఫ్యూచర్స్ 62 సెంట్లు పెరిగి 115.69 డాలర్ల వద్ద ఉంది.

సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దాడికి వ్యతిరేకంగా రష్యాపై ఆరో విడత ఆంక్షలు విధించేందుకు యురోపియన్ యూనియన్ సోమవారం, మంగళవారాల్లో సమావేశం కానుంది.

మాక్రో బాక్‌డ్రాప్ మారుతూ ఉంటుందని, రాబోయే 12 నెలల్లో క్రూడ్ డిమాండ్‌‌లో మెరుగుదలను ఇదే నిర్దేశిస్తుందని ఓండా సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ఎడ్వర్డ్ మోయా తెలిపారు.

‘భౌగోళిక రాజకీయాలు ఇప్పటికీ ముఖ్యమైన అంశమే. అయితే రష్యాపై ఆధారపడడాల్సిన పరిస్థితిని యురోపియన్ యూనియన్ తగ్గించింది..’ అని పేర్కొన్నారు.

ఈయూ ప్రభుత్వాలు రష్యన్ చమురుపై ఆంక్షలను అంగీకరించడంలో ఆదివార విఫలమయ్యాయి. అయితే పైప్‌లైన్ ద్వారా చమురు సరఫరాను అనుమతిస్తూ, సముద్రమార్గంలో సరఫరాను నిషేధించడంపై చర్చలు నడుస్తున్నాయి. కాగా సోమవారం మధ్యాహ్నం ఈయూ ప్రభుత్వాల శిఖరాగ్ర సమావేశం ఉంది.

‘ఇంధనం విషయంలో రష్యాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడంలో యురోపియన్ గ్రూప్‌కు ఇప్పటికీ కష్టంగా ఉంది. సమీప భవిష్యత్తులోనే ఇదే పరిస్థితి ఎదురవుతుది. తక్షణం దిగుమతులపై నిషేధం సాధ్యమయ్యే పరిస్థితి లేదు. డిమాండ్ కారణంగా సమీప భవిష్యత్తులోనూ ధరల పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది..’ అని సింగపూర్‌కు చెందిన డైలీ ఎఫ్ఎక్స్ అనలిస్ట్ లియోనా లియు తెలిపారు.

యూరప్, యూఎస్‌లో సమ్మర్ సీజన్ పీక్ డిమాండ్ నేపథ్యంలో గ్యాసోలిన్, డీజిల్, జెట్ ఫ్యూయల్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే క్రూడ్ మార్కెట్‌పై ఒత్తిడి పడుతుండగా ఇప్పుడు రష్యా చమురుపై ఈయూ నిషేధం విధిస్తే మరింత కఠినమైన పరిస్థితి ఏర్పడుతుంది.

చమురు ఉత్పత్తిని మరింత పెంచాలని కోరిన పాశ్చాత్య దేశాల విన్నపాన్ని పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్) గురువారం నాటి సమావేశంలో తిరస్కరించేందుకు సిద్ధమైంది. తమ జూలై అవుట్‌పుట్ లక్ష్యాన్ని రోజుకు 432,000 బ్యారెళ్లకు పెంచేందుకు ఇప్పటికే ఉన్న ప్రణాళికలకు కట్టుబడి ఉంటారని ఒపెక్ వర్గాలు తెలిపాయి.

Underscoring market tightness, the Organization of the Petroleum Exporting Countries and allies including Russia, a group dubbed OPEC+, are set to rebuff Western calls to speed up increases in output when they meet on Thursday. They will stick to existing plans to raise their July output target by 432,000 barrels per day, six OPEC+ sources told Reuters.

(Additional reporting by Sonali Paul in Melbourne and Koustav Samanta in Singapore; editing by Bradley Perrett and Jason Neely)

IPL_Entry_Point