Rupee falls: ఒక్క డాలర్‌కు 80.05 రూపాయలు.. రూపాయి పెరిగేదేలే-indian rupee falls past 80 against the dollar to hit record low ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Indian Rupee Falls Past 80 Against The Dollar To Hit Record Low

Rupee falls: ఒక్క డాలర్‌కు 80.05 రూపాయలు.. రూపాయి పెరిగేదేలే

Praveen Kumar Lenkala HT Telugu
Jul 19, 2022 09:59 AM IST

Dollar rate today: ఒక్క డాలరు విలువ 80.05 రూపాయలుగా ట్రేడవుతోంది.

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 80.05కు పతనం
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 80.05కు పతనం (AP)

ముంబై: డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 80.05 రూపాయలకు పడిపోయింది. దేశీయ మార్కెట్లు బలహీనంగా ఉండడం వల్ల రూపాయి విలువ పడిపోతున్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ చర్యల వల్ల రూపాయి నష్టాలు పరిమితంగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ వద్ద రూపాయి ఈ ఉదయం 80.05కు పడిపోయింది. క్రితం ముగింపుతో పోల్చితే 8 పైసలు బలహీనపడింది. ప్రస్తుతం 79.94 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా కరెన్సీ డాలరుతో పోలిస్తే జూన్ నెల నుంచి భారీగా పతనమైంది. జూన్ 13 నుంచి దాదాపుగా ప్రతి వారం కొత్తకొత్త కనిష్టాలకు పడిపోతూ వస్తోంది.

ముడి చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్భణం, వాణిజ్యలోటులో పెరుగుదల, డాలరు బలపడడం వంటి అనేక కారణాల వల్ల భారతీయ కరెన్సీ పతనమవుతూ వస్తోంది. అయితే యూరో సహా పలు ఇతర పటిష్టమైన కరెన్సీల్లో కూడా బలహీనత కనిపించింది.

ఇక దేశీయ మార్కెట్లలో మంగళవారం ఉదయం 9.53 సమయంలో సెన్సెక్స్ 18.30 పాయింట్లు, నిఫ్టీ 4.20 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్, ఎం అండ్ ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, ఐచర్ మోటార్స్, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, సిప్లా, అదానీ పోర్ట్స్ తదితర స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, నెస్లే, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌యూఎల్ తదితర స్టాక్స్ నష్టాల జాబితాలో ఉన్నాయి.

నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫిన్ సర్వ్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ తదితర రంగాల స్టాక్స్ మినహా అన్ని సెక్టోరియల్ సూచీలు సానుకూలంగానే ట్రేడవుతున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం