US - China - Taiwan story | తైవాన్‌కు అమెరికా మ‌ద్ద‌తు వెనుక అస‌లు క‌థ ఇదా..?-reason behind us supporting taiwan is taiwan dominates computer chips supply ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Reason Behind Us Supporting Taiwan Is Taiwan Dominates Computer Chips Supply

US - China - Taiwan story | తైవాన్‌కు అమెరికా మ‌ద్ద‌తు వెనుక అస‌లు క‌థ ఇదా..?

Sudarshan Vaddanam HT Telugu
Aug 05, 2022 05:17 PM IST

అమెరికా ప్ర‌తినిధుల స‌భ స్పీక‌ర్ నాన్సీ పెలోసీ తైవాన్ ప‌ర్య‌ట‌న వెనుక పెద్ద క‌థే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ``తైవాన్ ప్ర‌జాస్వామ్యానికి మ‌ద్ద‌తు, తైవాన్ స్వ‌యంపాల‌న‌ను గౌర‌విస్తాం, తైవాన్‌ను వ‌దిలేయం..`` అంటూ అమెరికా చేసే ప్ర‌క‌ట‌న‌ల వెనుక ఉన్న `చిప్‌` స్టోరీ ఇది..

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

US - China - Taiwan story | అమెరికా హౌజ్ స్పీక‌ర్ నాన్సీ పెలోసీ ఇటీవ‌లి తైవాన్ ప‌ర్య‌ట‌న‌తో అమెరికా, చైనాల మ‌ధ్య‌.. చైనా, తైవాన్‌ల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. నిప్పుతో చెల‌గాటం వ‌ద్దు అంటూ చైనా తీవ్ర స్థాయిలో చేసిన హెచ్చ‌రిక‌ల‌ను పెడ‌చెవిన పెట్టి మ‌రీ నాన్సీ పెలోసీ తైవాన్‌లో అడుగుపెట్టారు. ఈ స్థాయిలో చైనా హెచ్చ‌రిక‌ల‌ను బేఖాత‌రు చేయ‌డం వెనుక అమెరికా ఆర్థిక‌, వాణిజ్య అవ‌స‌రాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

US - China - Taiwan story | సెమీకండ‌క్ట‌ర్ అవ‌స‌రాలు..

అమెరికా హౌజ్ స్పీక‌ర్ నాన్సీ పెలోసీ తైవాన్ ప‌ర్య‌ట‌న‌లో మీడియా అంతా ఆమె రాజ‌కీయ ఎంగేజ్‌మెంట్స్ పైన‌నే దృష్టి పెట్టాయి. కానీ, ఆమె తైవాన్ సెమీకండ‌క్ట‌ర్ మ్యాన్యుఫాక్చ‌రింగ్ కార్పొరేష‌న్‌(Taiwan Semiconductor Manufacturing Corporation - TSMC) చైర్మ‌న్ మార్క్ లూయి తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. అమెరికా త‌న సెమీకండ‌క్ట‌ర్ అవ‌స‌రాల‌కు తైవాన్‌పైన‌నే ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతోంది. ప్ర‌స్తుత టెక్నాల‌జీ కాలంలో అన్ని నెట్‌వ‌ర్క్‌డ్ డివైజెస్‌కు `సెమీకండ‌క్ట‌ర్` లేదా సాధార‌ణ భాష‌లో `కంప్యూట‌ర్ చిప్‌`, లేదా `చిప్‌` నిత్యావ‌స‌రంగా మారిన విష‌యం తెలిసిందే. చిప్ సప్లై నిలిచిపోతే, డిజిట‌ల్ ప్ర‌పంచ‌మే నిలిచిపోయే ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఉంది. ఆధునిక‌ మిల‌ట‌రీ ఎక్వీప్‌మెంట్‌కు కూడా ఈ చిప్స్ నే ప్రాణాధారం. ఈ నేప‌థ్యంలో, యూఎస్‌లో భారీగా పెరుగుతున్న‌ సెమీ కండ‌క్ట‌ర్ అవ‌స‌రాల కోసం తైవాన్ స‌హ‌కారం అమెరికాకు ఎంతో కీల‌కం. తైవాన్‌పై చైనా ఆధిప‌త్యం ఈ విష‌యంలో అమెరికాను దెబ్బ‌తీస్తుంది. అందువ‌ల్ల‌నే తైవాన్ స్వ‌యంపాల‌న‌కు అమెరికా మ‌ద్ద‌తిస్తోంది.

US - China - Taiwan story | అమెరికా వ్యూహం

ఈ ప‌రిస్థితుల్లో తైవాన్‌లోనే కాకుండా, అమెరికాలో కూడా చిప్ త‌యారీ ప్రారంభించాల‌ని, అందుకు అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తులు స‌మ‌కూరుస్తామ‌ని నాన్సీ పెలోసీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా TSMC చైర్మ‌న్ మార్క్ లూయికి అమెరికా నుంచి ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. ప్ర‌స్తుతం న‌డుస్తోంది సూప‌ర్ ఫాస్ట్ 5G ఇంట‌ర్నెట్ యుగం. ఈ వేగం వెనుక రిఫైన్డ్ సెమీకండ‌క్ట‌ర్లు ఉంటాయి. అమెరికాలోని ఇంటెల్ వంటి సంస్థ‌లు కూడా త‌మ చిప్ సప్లై చెయిన్ విష‌యంలో ఆసియాపైన‌నే, ముఖ్యంగా తైవాన్‌పైన‌నే ఎక్కువగా ఆధార‌ప‌డ్తాయి. అందువ‌ల్ల తైవాన్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం వెనుక అమెరికా ఆర్థిక‌, వాణిజ్య వ్యూహాల పాత్రే కీల‌క‌మ‌ని తెలుస్తుంది.

US - China - Taiwan story | తైవాన్ ఎందుకు కీల‌కం

మొత్తం ప్ర‌పంచంలో త‌యార‌య్యే సెమీ కండ‌క్ట‌ర్ల‌లో 63% తైవాన్‌లోనే ఉత్ప‌త్తి అవుతాయి. ఇందులో 53% మార్కెట్ Taiwan Semiconductor Manufacturing Corporation - TSMC దే. వేరే దేశాల్లో డిజైన్ చేసిన చిప్స్‌.. బ‌ల్క్ ప్రొడ‌క్ష‌న్ కోసం మ‌ళ్లీ తైవాన్‌లోని కంపెనీల‌ను, ముఖ్యంగా TSMC నే ఆశ్ర‌యిస్తాయి. ఇదే విష‌యాన్ని అమెరికా ఇటీవ‌లి స‌ప్లై చెయిన్ రివ్యూ నివేదిక వెల్ల‌డించింది. సెమీకండ‌క్ల‌ర్ల సప్లై కోసం అమెరికా TSMC అనే ఒకే కంపెనీపై అధికంగా ఆధార‌ప‌డుతోందని ఆ నివేదిక వెల్ల‌డించింది. అత్యంత ఆధునిక సెమీకండ‌క్ల‌ర్ల‌ను(five nanometres) ఉత్ప‌త్తి చేస్తున్న కంపెనీల్లో ప్ర‌ధాన‌మైన‌వి TSMC, Samsung. Samsung ద‌క్షిణ కొరియాకు చెందిన సంస్థ‌.

IPL_Entry_Point