Stock market today: ఫ్లాట్‌గా సెన్సెక్స్, నిఫ్టీ
Stock market today: స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.
Stock market today: స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 26.38 పాయింట్లు కోల్పోయి 59,306 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 10.05 పాయింట్లు కోల్పోయి 17,654 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
టాప్ గెయినర్స్ జాబితాలో ఓఎన్‌జీసీ, హిందాల్కో, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, పవర్ గ్రిడ్ కార్ప్, హెచ్‌యూఎల్ తదితర స్టాక్స్ ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, హీరోమోటోకార్ప్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్స్ తదితర స్టాక్స్ ఉన్నాయి.
సెక్టోరియల్ సూచీల్లో నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ మీడియా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ ఇన్‌ఫ్రా, నిఫ్టీ కమాడిటీస్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ఫిన్ సర్వ్ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 96.62 పాయింట్లు నష్టపోయి 59,235.98 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 0.65 పాయింట్లు బలపడి 17,659 పాయింట్ల వద్ద స్థిరపడింది.
కాగా గురువారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. రెండు వారాలుగా లాభాల్లో సాగి మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపాయి.