Telugu News  /  National International  /  Ruble Tumbles To Lowest Since 2016
వీడియో సందేశంలో పుతిన్
వీడియో సందేశంలో పుతిన్ (via REUTERS)

Russia Ukraine Conflict | ఆరేళ్ల కనిష్టానికి రూబుల్, నిలిచిపోయిన ట్రేడింగ్

24 February 2022, 10:29 ISTHT Telugu Desk
24 February 2022, 10:29 IST

రష్యా కరెన్సీ రూబుల్ మారకం విలువ పడిపోతూ వస్తోంది. పుతిన్ తాజా ప్రకటనతో 2016 నాటి కనిష్టానికి చేరుకుంది.

రష్యా దళాలు ఉక్రెయిన్ నగరాలపై దాడికి దిగాక రూబుల్ 2016 నాటి కనిష్ట స్థాయికి క్షీణించింది.

ట్రెండింగ్ వార్తలు

బ్లూమ్‌బర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం గురువారం ఆన్‌షోర్ ట్రేడింగ్‌లో రష్యన్ కరెన్సీ డాలర్ విలువతో పోల్చితే 3.5% తగ్గి 84.1కి పడిపోయింది.

ట్రేడింగ్ బ్యాండ్ పరిమితులను తాకడంతో మాస్కో ఎక్స్ఛేంజ్‌లో రూబుల్, షేర్లు, ఫ్యూచర్‌లలో ట్రేడింగ్ నిలిచిపోయింది.

అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ ఈ చర్యను ‘ఇది అన్యాయమైన దాడి. ఎలాంటి రెచ్చగొట్టే పరిస్థితులు లేకున్నప్పటికీ జరిగిన దాడి..’ అని అభివర్ణించారు. 

మరోవైపు భారతీయ మార్కెట్లు యుద్ధ వార్తలు విని కుప్పకూలడం మొదలై.. చివరకు 10.15 గంటల సమయానికి కాస్త కుదుటపడ్డాయి. మొత్తంగా సెన్సెక్స్ 1614 పాయింట్లు కోల్పోయి 55,617 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 466 పాయింట్లు కోల్పోయి 16,596 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

టాపిక్