Republic Day: ఈ రిపబ్లిక్ డే ప్రదర్శనల్లో ఈ మూడు శకటాలపైనే అందరి దృష్టి-republic day isro steals show with chandrayaan 3 what csir meity presented ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Republic Day: ఈ రిపబ్లిక్ డే ప్రదర్శనల్లో ఈ మూడు శకటాలపైనే అందరి దృష్టి

Republic Day: ఈ రిపబ్లిక్ డే ప్రదర్శనల్లో ఈ మూడు శకటాలపైనే అందరి దృష్టి

HT Telugu Desk HT Telugu
Jan 26, 2024 03:48 PM IST

Republic Day: ఈ సంవత్సరం రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఢిల్లీ కర్తవ్య పథ్ లో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వాటిలో ముఖ్యంగా 3 శకటాలను అద్భుతంగా రూపొందించారు.

రిపబ్లిక్ డే పరేడ్ లో ఇస్రో శకటం
రిపబ్లిక్ డే పరేడ్ లో ఇస్రో శకటం (YouTube/Narendra Modi)

న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ లో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్ లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రదర్శించిన శకటం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ శకటంపై చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ ను, చంద్రయాన్ 3 సాధించిన విజయాలను ఇస్రో వివరించింది.

ISRO tableau: చంద్రయాన్ 3

చంద్రయాన్ 3 ఆగస్టు 23 న చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా'చంద్రయాన్ 3: ఎ సాగా ఇన్ ఇండియన్ స్పేస్ హిస్టరీ' అనే థీమ్ తో ఈ శకటాన్ని ఇస్రో రూపొందించింది. విక్రమ్ ల్యాండర్ క్యాప్సూల్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న వర్కింగ్ మోడల్స్ ను ప్రదర్శించింది. ఈ అద్భుత విజయానికి గుర్తుగా చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో శివశక్తి పాయింట్ పేరుతో ల్యాండింగ్ ప్రాంతాన్ని ప్రదర్శించారు. చంద్రయాన్ 3 ఆగస్టు 23 న చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా, నియంత్రిత లూనార్ ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. పది రోజుల చంద్రుడి అన్వేషణ తర్వాత ల్యాండర్, రోవర్ స్లీప్ మోడ్ లోకి ప్రవేశించగా, ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది. ఈ శకటంపై ఎనిమిది మంది మహిళా శాస్త్రవేత్తలతో పాటు భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ మిషన్ ‘ఆదిత్య ఎల్ 1’, రాబోయే మానవ సహిత అంతరిక్ష మిషన్ ‘గగన్ యాన్’ ను కూడా చిత్రీకరించింది.

CSIR tableau: పర్పుల్ విప్లవం

రిపబ్లిక్ డే పరేడ్ లో సీఎస్ఐఆర్ శకటం
రిపబ్లిక్ డే పరేడ్ లో సీఎస్ఐఆర్ శకటం (YouTube/Narendra Modi)

75వ గణతంత్ర దినోత్సవ పరేడ్ (Republic Day parade) లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ‘వికసిత భారత్’ (Vikasit Bharat) థీమ్ తో శకటాన్ని ప్రదర్శించింది. ఈ శకటాన్ని ప్రధానంగా, జమ్మూ కాశ్మీర్లో లావెండర్ సాగు విషయంలో సీఎస్ఐఆర్ సాధించి విజయాన్ని వివరిస్తూ రూపొందించింది. సీఎస్ఐఆర్ సహకారంతో జమ్మూ కాశ్మీర్లో లావెండర్ సాగు గణనీయంగా పెరిగింది. ల్యాబ్ నుంచి లావెండర్ ను మార్కెట్ కు తీసుకెళ్లడంలో, అగ్రి స్టార్టప్ లను ప్రోత్సహించడంలో సీఎస్ఐఆర్ గణనీయ పాత్ర పోషించింది. అలాగే, ఈ శకటంపై, ఆగ్రో మెకానికల్ టెక్నాలజీ కింద, సిఎస్ఐఆర్ దేశీయంగా అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ప్రైమా ఇటీ 11 ను కూడా ప్రదర్శించారు. ఈ ట్రాక్టర్ ను మహిళలు కూడా సులభంగా నడపవచ్చు.

MEITY tableau: కృత్రిమ మేథ

రిపబ్లిక్ డే పరేడ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ శకటం
రిపబ్లిక్ డే పరేడ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ శకటం (YouTube/Narendra modi)

ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MEITY) రూపొందించిన శకటం ఆకర్షణీయంగా ఉంది. ప్రపంచంపై కృత్రిమ మేథ (AI) సానుకూల ప్రభావాన్ని ప్రతిబింబించేలా శకటాన్ని రూపొందించారు. దీనిపై కృత్రిమ మేధకు ప్రతీకగా ఒక మహిళా రోబో ను అమర్చారు. ‘గ్లోబల్ పార్ట్ నర్ షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (GPAI) లో అధ్యక్ష దేశంగా భారత్ పాత్రను వివరించింది. లాజిస్టిక్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లో AI అప్లికేషన్ లను విజువల్ గా ఎంగేజింగ్ మోడల్స్ ద్వారా MEITY టాబ్లో చిత్రీకరించింది. రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలు, సెల్ఫ్ డెలివరీ డ్రోన్లు, వినూత్న విద్యావిధానాలు, దైనందిన జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క విభిన్న అనువర్తనాలను వివరించారు. విద్య, పశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా మహిళల సాధికారతలో కృత్రిమ మేధ పాత్రను వివరించింది.

IPL_Entry_Point