Ram Madhav: బీజేపీ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జ్ గా రామ్ మాధవ్-ram madhav returns as bjps election in charge for jammu and kashmir ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ram Madhav: బీజేపీ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జ్ గా రామ్ మాధవ్

Ram Madhav: బీజేపీ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జ్ గా రామ్ మాధవ్

HT Telugu Desk HT Telugu
Aug 21, 2024 08:29 PM IST

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జమ్మూకశ్మీర్లో బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్ ను నియమించింది. గతంలో ఇక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రామ్ మాధవ్ ను మరోసారి అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జిగా నియమించింది. 2015లో రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో రాంమాధవ్ కీలక పాత్ర పోషించారు.

బీజేపీ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జ్ గా మళ్లీ రాం మాధవ్
బీజేపీ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జ్ గా మళ్లీ రాం మాధవ్

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఆర్ఎస్ఎస్ నేత, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను ఎన్నికల ఇన్ చార్జిగా భారతీయ జనతా పార్టీ నియమించింది. 2015లో అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ రావడంతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు. మరోసారి, ఈ వ్యూహకర్తకు కీలక బాధ్యతలను అప్పగించారు. ఆ తరువాత, 2018లో అప్పటి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఈ కూటమి ప్రభుత్వం కూలిపోయింది.

క్రియాశీలక రాజకీయాల్లోకి రీఎంట్రీ

బీజేపీ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జ్ నియామకంతో రాంమాధవ్ క్రియాశీలక రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో పార్టీ బాధ్యతలను రామ్ మాధవ్ పంచుకోనున్నారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఇద్దరు నేతలను ఎన్నికల ఇంచార్జీలుగా నియమించినట్లు బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు ఒక రాష్ట్రంలో ఒకరికి మించి ఎన్నికల ఇన్ చార్జ్ లను నియమించడం బీజేపీలో అసాధారణం. 2014-2020 మధ్య కాలంలో బీజేపీ కీలక సంస్థాగత నేతగా ఉన్న మాధవ్ పదేళ్ల క్రితం జమ్మూకశ్మీర్ రాష్ట్ర రాజకీయాలతో లోతుగా మమేకమయ్యారు.

బీజేపీ నుంచి మళ్లీ ఆరెస్సెస్ కు..

2020లో రామ్ మాధవ్ ను బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారు. ఆ తరువాత 2021లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమించారు. థింక్ ట్యాంక్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడిగా ఉన్న మాధవ్ మీడియాలో ఒపీనియన్ పేజీలకు క్రమం తప్పకుండా కంట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో బీజేపీలో ఉన్న సమయంలో ఈశాన్య ప్రాంతంలో పార్టీ విస్తరణకు శ్రీకారం చుట్టిన పార్టీ ప్రధాన కార్యదర్శుల్లో ఆయన ఒకరు.

మూడు దశల్లో ఎన్నికలు

జమ్ముకశ్మీర్ లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న జరుగుతుంది. మిగతా రెండు రౌండ్ లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. ఆగస్టు 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 25, పీడీపీకి 28 సీట్లు రాగా, 87 మంది సభ్యులున్న సభలో పీడీపీ 28 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జమ్మూ ప్రాంతంలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. ముస్లింలు అధికంగా ఉండే కశ్మీర్ లోయలో 47 స్థానాలు ఉన్నాయి.