ED Director: ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate ED) తాత్కాలిక చీఫ్ రాహుల్ నవీన్ ను ఫుల్ టైమ్ డైరెక్టర్ గా ప్రభుత్వం బుధవారం నియమించింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉంటారు. కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆగస్టు 14న విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కొత్త డైరెక్టర్ గా రాహుల్ నవీన్ నియామకాన్ని ధృవీకరించింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని, రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన నియామకం కొనసాగుతుందని పేర్కొంది.
ఐఆర్ఎస్ (ఐటీ:93074), ఈడీ స్పెషల్ డైరెక్టర్ రాహుల్ నవీన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ గా నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని డీవోపీటీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)లో తాత్కాలిక డైరెక్టర్ గా పనిచేస్తున్న నవీన్ 1993 బ్యాచ్ కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి. సంజయ్ కుమార్ మిశ్రా స్థానంలో గత ఏడాది సెప్టెంబర్ లో ఆయన ఈడీ తాత్కాలిక డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.
టాపిక్