Pathancheru Mla: ఈడీ దాడులతో పఠాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి-pathancheru mla mahipal reddy suffocated by ed attacks ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pathancheru Mla: ఈడీ దాడులతో పఠాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి

Pathancheru Mla: ఈడీ దాడులతో పఠాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి

HT Telugu Desk HT Telugu
Jul 04, 2024 09:35 AM IST

Pathancheru Mla: ఇప్పటికే అధికారం కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఈడీ దాడులతో మహిపాల్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి
ఈడీ దాడులతో మహిపాల్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి

Pathancheru Mla: ఇప్పటికే అధికారం కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పఠాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పైన గత నెల 20 వ తారీఖున ఈడీ అధికారులు దాడులు నిర్వహించడంతో పాటు, పలు కీలకమైన పత్రాలను తమతో తీసుకెళ్లారు.

ఆ పత్రాల ఆధారంగా విచారణ చేస్తున్న ఈడీ అధికారులు, గత మంగళరవారం రోజు మహిపాల్ రెడ్డి ని హైదరాబాద్ లో ఈడీ ఆఫీస్ కు పిలిపించి విచారణ చేశారు. నిన్న (బుధవారం), ఈడీ అధికారులు పఠాన్ చెరువులోని ఎమ్మెల్యే నివాసానికి మరొకసారి వచ్చి, తనకు యాక్సిస్ బ్యాంకు లో లాకర్లు ఉండటంతో వాటిని మహిపాల్ రెడ్డి సమక్షంలోనే ఓపెన్ చేసి ఆ లాకర్లో ఉన్న పలు కీలకమైన పత్రాలను తమతో తీసుకెళ్లినట్టు తెలుస్తుంది.

విచారణ మొత్తం అక్రమ మైనింగ్ చుట్టే....

ఈడీ విచారణ మొత్తం కూడా, మహిపాల్ రెడ్డి చేసిన అక్రమ మైనింగ్ లో చేసిన 300 కోట్ల రూపాయలను ఎక్కడ పెట్టుబడి పెట్టాడు, ఆ పెట్టుబడులు ఎవరిపైన వున్నాయి అనేది తేల్చడమే లక్ష్యంగా సాగుతున్నాయిని తేటతెల్లం అవుతుంది.

మహిపాల్ రెడ్డి సోదరునికి పఠాన్ చెరువు మండలంలోని లక్డారం గ్రామంలో సంతోష్ గ్రానైట్ కంపెనీ ఉన్నది, ఆ గ్రానైట్ కంపెనీ తమకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ భూమిలో తవ్వకాలు చేపట్టినట్టు మైనింగ్ డిపార్ట్మెంట్ విచారణ చేసి తేటతెల్లం చేసింది.

సంతోష్ గ్రానైట్ కంపెనీ మూడు వందల కోట్లకు విలువైన అక్రమ మైనింగ్ పాల్పడినట్టు తేల్చింది. అయితే, ఆ డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టారనేది మహిపాల్ రెడ్డి తమ అకౌంట్లలో చూపెట్టలేదు. ఈడీ అధికారుల విచారణ మొత్తం, ఈ 300 కోట్ల చుట్టే జరుగుతున్నది. అయితే, మహిపాల్ రెడ్డి మాత్రం తాము ఎలాంటి అక్రమ్ మైనింగ్ పాల్పడలేదని, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను వేధించడమే లక్షంగా అధికారలో ఉన్న పార్టీలు ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అక్రమ మైనింగ్ చేయకపోతే, అక్రమ డబ్బులు ఎలా ఉంటాయని మహిపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. మహిపాల్ రెడ్డి ఆర్ధిక వ్యవహారాలు, వ్యాపారాలు చూసుకునే తన సొంత సోదరుడు మధుసూదన్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు ఈడీ దాడుల పైన ఎటువంటి ప్రకటన కూడా చేయకపోవడం ఆలోచించదగ్గ విషయం.

ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసిన మహిపాల్ రెడ్డి....

ఈడీ దాడుల నేపథ్యంలో, మహిపాల్ రెడ్డి గత నెల చివరి వారంలో, ఢిల్లీ కి వెళ్లి పలువు బీజేపీ పెద్దలను కలిసినట్టు తెలుస్తుంది. బీజేపీ నాయకుడు, మాజీ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ సహకారంతో, బీజేపీ నేతలను కలిసిన తనకు వారినుండి ఎటువంటి హామీ లభించనట్టు తెలుస్తుంది.

ఈడీ అధికారులు, మహిపాల్ రెడ్డి లాకర్ నుండి పలు కీలకమైన పత్రాలు తీసుకెళ్ళటంతో, తదుపరి ఈడీ ఏమి చెయ్యబోతున్నదనే విషయం పైనే సర్వత్రా చర్చ నడుస్తుంది. ఎమ్మెల్యే, తన సోదరుని అక్రమాల పైన ఈడీకి ఏమైనా ఆధారాలు దొరికాయి, దొరికితే వారిని అరెస్ట్ చేయబోతున్నారా అనే విషయాల పైన నియోజకవర్గం మొత్తం ప్రజలు చర్చించించుకుంటున్నారు.