Prajwal Revanna : 'విచారణకు వస్తా'- సెక్స్​ కుంభకోణం నిందితుడు ప్రజ్వల్​ రేవన్న వీడియో..-prajwal revanna releases video says will appear before sit on may 31 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Prajwal Revanna : 'విచారణకు వస్తా'- సెక్స్​ కుంభకోణం నిందితుడు ప్రజ్వల్​ రేవన్న వీడియో..

Prajwal Revanna : 'విచారణకు వస్తా'- సెక్స్​ కుంభకోణం నిందితుడు ప్రజ్వల్​ రేవన్న వీడియో..

Sharath Chitturi HT Telugu
May 27, 2024 05:20 PM IST

Prajwal Revanna video : తాను మే 31న సిట్​ విచారణకు హాజరవుతానని జేడీఎస్​ సస్పెండెడ్​ ఎంపీ ప్రజ్వల్​ రేవన్న తెలిపారు. ఆయనపై సెక్స్​ కుంభకోణం కేసు ఉన్న విషయం తెలిసిందే..

ప్రజ్వల్​ రేవన్న..
ప్రజ్వల్​ రేవన్న..

Prajwal Revanna video : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హసన్​ సెక్స్​ కుంభకోణానికి కేంద్రబిందువుగా ఉన్న ఆ ప్రాంత ఎంపీ, జేడీఎస్​ సస్పెండెడ్​ నేత ప్రజ్వల్​ రేవన్న.. తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. మే 31న తాను సిట్​ విచారణకు హాజరవుతానని ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. అధికారులకు పూర్తిస్థాయిలో మద్దతిస్తానని స్పష్టం చేశారు.

ఇదీ జరిగింది..

ఎందరో మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని ప్రజ్వల్​ రేవన్నపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో డిప్లొమాటిక్​ పాస్​పోర్ట్​ మీద, ఏప్రిల్​ 27న దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు ప్రజ్వల్​. ఆ వెంటనే.. సెక్స్​ కుంభకోణంపై సిట్​ దర్యాప్తునకు ఆదేశించింది కర్ణాటక ప్రభుత్వం.

మరోవైపు.. లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో.. రేవన్నని జేడీఎస్​ సస్పెండ్​ చేసింది. దేశానికి తిరిగి వచ్చి, విచారణకు హాజరవ్వాలని.. ప్రజ్వల్​ రేవన్న తాత- భారత దేశ మాజీ ప్రధాని హెచ్​డీ దేవెగౌడ తేల్చి చెప్పారు.

Prajwal Revanna case : ఈ తరుణంలో.. ఒక వీడియోని విడుదల చేశారు ప్రజ్వల్​. తాను సిట్​ విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.

"నా తల్లిదండ్రులకు క్షమాపణలు. నేను డిప్రెషన్​లో ఉన్నాను. నేను ఇండియాకి తిరిగి వస్తాను. మే 31 (శుక్రవారం) సిట్​ దర్యాప్తునకు హాజరవుతాను. నా సామర్థ్యానికి తగట్టు అధికారులకు సహకరిస్తాను. అన్నింటికీ సమాధానాలు చెబుతాను. న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. నా మీద వచ్చినవి తప్పుడు ఆరోపణలని రుజువవుతాయి. ఆ దేవుడు, కుటుంబసభ్యుల ఆశిస్సులు నాకు ఉన్నాయి," అని ప్రజ్వల్​ రేవన్న చెప్పుకొచ్చాడు.

దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన 4 రోజులకు.. మే 1న ఓ ట్విటీ చేశారు ప్రజ్వల్​. 'నేను బెంగళూరులో లేను. ఈ విషయాన్ని పోలీసులకు నా లాయర్​ సమాచారం ఇచ్చారు,' అని పేర్కొన్నారు.

Prajwal Revanna latest news : "నా సహనాన్ని పరీక్షించకు అని ప్రజ్వల్​కి వార్నింగ్​ ఇచ్చాను. వాస్తవానికి షాక్​, బాధ నుంచి తేరుకోవడానికి నాకు సమయం పట్టింది. నా మనవడిని నేను దేశం దాటించానని కాంగ్రెస్​, దాని మిత్ర పక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. నేరం రుజువైతే.. ప్రజ్వల్​ రేవన్నకి చట్టంలోని కఠిన శిక్షలు వేయాలని నేనే చెబుతున్నాను," అని చెప్పుకొచ్చారు హెచ్​డీ దేవెగౌడ.

హసన్​ ఎంపీని ఇండియాకు తిరిగి రావాలని తాను కూడా అభ్యర్థించినట్టు ప్రజ్వర్​ రేవన్న తండ్రి రేవన్న సోదరుడు కుమారస్వామి ఇటీవలే తెలిపారు.

Prajwal Revanna Hasan MP : "ప్రజ్వల్​ ఇండియాకు తిరిగి రావాలని నేను కోరాను. దర్యాప్తునకు సహకరించాలని చెప్పాను. తప్పు చేయకపోతే నమ్మించు. చేస్తే.. శిక్ష ఎదుర్కో," అని కుమారస్వామి అన్నారు.

ప్రజ్వల్​ రేవన్న వద్ద ఉన్న డిప్లొమాటిక్​ పాస్​పోర్ట్​ని కేంద్రం రద్దు చేసే పనిలో ఉంది. ఈ మేరకు.. కర్ణాటక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం హసన్​ ఎంపీగా ఉన్న ప్రజ్వల్​ రేవన్న.. 2024 లోక్​సభ ఎన్నికల్లోనూ బీజేపీ- జేడీఎస్​ కూటమిలో భాగంగా.. అక్కడి నుంచే పోటీ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం