Modi Russia Tour : మోదీ కోసం రష్యా ఎందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది? పుతిన్ ప్లాన్ ఏంటి?
Modi-Putin Meeting : ప్రధాని మోదీ రష్యాలో పర్యటన అందరికీ ఆసక్తిని రేపుతోంది. ప్రధాని మోదీ వ్లాదిమిర్ పుతిన్‌ను కలవనున్నారు. అయితే ఈ కలవడం వెనక అనేక ఊహాగానాలు వస్తు్న్నాయి. మోదీని పుతిన్ ఎందుకు ఆహ్వానించినట్టు అనే ప్రశ్నలు సహజంగానే అందరికీ ఉన్నాయి.
దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రధాని మోదీ రష్యా పర్యటకు వెళ్లారు. పుతిన్‌ను కలవడానికి మాస్కోకు వెళ్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోదీని ఆహ్వానించారు. ప్రధాని మోదీ జూలై 8, 9 తేదీల్లో మాస్కోలో 22వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు.
ప్రధాని మోదీ రష్యా పర్యటనపై ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మోదీ ఈ పర్యటనతో పశ్చిమ దేశాల ప్రణాళికలను ఇబ్బంది పెట్టాలని పుతిన్ ప్లాన్ చేస్తున్నారని ఓ వాదన కూడా ఉంది. ఇరువురు నేతల భేటీ పట్ల పశ్చిమ దేశాలు చాలా అసూయపడతాయని రష్యా విశ్వసిస్తోంది.
నిజానికి, ప్రధాని మోదీ మాస్కో పర్యటన రష్యాకు పెద్ద అవకాశం. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు రష్యాను ఏకాకిని చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ప్రధాని మోదీ పర్యటన ద్వారా రష్యా ఒంటరిగా లేదని పశ్చిమ దేశాలకు ఓ సందేశాన్ని పంపవచ్చు.
ఉక్రెయిన్‌లో యుద్ధం ఉన్నప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాలు దానికి అండగా నిలుస్తున్నాయి. మోదీ ఈ పర్యటనతో పశ్చిమ దేశాల ప్రణాళికలను రష్యా చెడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని కొందరు అంటున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు, సమావేశంతో ఎలాంటి మార్పులు ఉంటాయో ఎదురుచూడాలి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో చాలా పరిణామాలు జరిగాయి. ఉక్రెయిన్‌పై రష్యా ఇంకా దూకుడుగా దాడి చేస్తోంది. అదే సమయంలో రష్యాను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయి. రష్యాను వేరు చేయాలనుకుంటున్నాయి. అయితే దీన్ని అంగీకరించేందుకు పుతిన్ కూడా సిద్ధంగా లేడు. పాశ్చాత్య దేశాలకు కూడా ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూనే ఉన్నారు.
రష్యా మాత్రం తాను ఏకాకి కాదు అనే విషయాన్ని చూపించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కొన్నిసార్లు చైనాను లక్ష్యంగా చేసుకుంటూ, కొన్నిసార్లు ఉత్తర కొరియాను సందర్శించి, కొన్నిసార్లు వియత్నాంతో సహా, ప్రపంచంలోని చాలా దేశాలు తమతో ఉన్నాయని చెబుతోంది. దీంతో మోదీ పర్యటనను రష్యా ఓ అవకాశంగా భావిస్తోంది. మోదీ ఈ పర్యటనతో రష్యా పశ్చిమ దేశాల వేర్పాటువాద ప్రణాళికలను ధ్వంసం చేస్తున్నదన్న సందేశాన్ని ప్రపంచానికి అందించాలనే ఆలోచనలో ఉంది. తమకు మద్దతు తెలిపే దేశాలు ఉన్నాయని ప్రపంచానికి చెప్పాలని రష్యా భావిస్తున్నట్టుగా పలువురు అంటున్నారు.
పుతిన్ ఆహ్వానం మేరకు జూలై 8, 9 తేదీల్లో జరిగే భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరవుతారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రధాని మోదీ పర్యటన ఇదే తొలిసారి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఫిబ్రవరి 2022లో ప్రారంభమైంది. పశ్చిమ దేశాల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ, భారతదేశం సైలెంట్‌గానే ఉంది. భారతదేశం-రష్యా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా వ్యవహరించింది. చమురు కొనుగోలును కొనసాగించింది. యుద్ధ సమయంలో కూడా రష్యాకు డబ్బు కొరత లేదు. అయితే శాంతికి తాము అనుకూలమని రష్యాకు భారత్ స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి శాంతి చర్చలే పరిష్కారమని ప్రధాని మోదీ పదే పదే పునరుద్ఘాటించారు. ఇప్పుడు ప్రధాని మోదీ పర్యటనతో తమకు భారతదేశం మద్దతు కూడా ఉందని రష్యా చూపించుకునే ప్రయత్నం చేస్తుందని నిపుణులు అంటున్నారు.