Traffic Challan : హెల్మెట్ పెట్టుకోలేదని లక్ష రూపాయల ఫైన్.. చలాన్ చూసి షాక్ అవుతున్న జనం-person received 1 lakh challan for not wearing helmet in bihar ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Traffic Challan : హెల్మెట్ పెట్టుకోలేదని లక్ష రూపాయల ఫైన్.. చలాన్ చూసి షాక్ అవుతున్న జనం

Traffic Challan : హెల్మెట్ పెట్టుకోలేదని లక్ష రూపాయల ఫైన్.. చలాన్ చూసి షాక్ అవుతున్న జనం

Anand Sai HT Telugu
Oct 09, 2024 10:06 AM IST

Traffic Challan : కొన్నిసార్లు ట్రాఫిక్ చలాన్ చూసి షాక్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నిబంధనలకు మించిన చలాన్ కనిపిస్తూ ఉంటుంది. ఓ వ్యక్తి అలానే లక్ష రూపాయల ఫైన్ వేశారు. అది కూడా హెల్మెట్ పెట్టుకోలేదని. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

హెల్మెట్ పెట్టుకోలేదని లక్ష రూపాయల ఫైన్
హెల్మెట్ పెట్టుకోలేదని లక్ష రూపాయల ఫైన్

హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి. ఇది లేకుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా చాలా మంది ఈ విషయాన్ని లైట్ తీసుకుంటారు. కానీ మీకోసం మీ కుటుంబ ఎదురుచూస్తోందని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అయితే హెల్మెట్ పెట్టుకోకుంటే ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధిస్తారని అందరికీ తెలిసిందే. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా లక్ష రూపాయల ఫైన్ వేశారు. దీంతో అతడు లబోదిబోమంటున్నాడు.

కొన్నిసార్లు కొంతమంది ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన కేసులు  వింతగా ఉంటాయి. బీహార్‌కు సంబంధించి ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి బీహార్‌లోని సుపౌల్‌లో ట్రాఫిక్ పోలీసుల ఈ-చలాన్ విధానం సామాన్యులకు సమస్యగా మారింది. మహ్మద్ అఫ్రోజ్ ఆలం అనే ఓ గుమస్తా తన బైక్‌కు రూ.1,00,000 ఫైన్ చూసి షాక్ అయ్యాడు. పొల్యూషన్ సర్టిఫికేట్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అసలు ఏంటి సమస్య అని చూస్తే.. భారీ చలాన్ కనిపించింది. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న సమయంలో డిగ్రీ కాలేజ్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు తన ఫొటో తీసి జరిమానా విధించారు.

కానీ తన ఫోన్‌కు మాత్రం రూ.1,00,000 చలానా వచ్చినట్లు తన మొబైల్ ఫోన్‌కు మెసేజ్ రావడంతో అఫ్రోజ్ షాక్‌కు గురయ్యాడు. అఫ్రోజ్ వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా చలాన్‌లో దిద్దుబాటు చేయలేదు. ఈ చలాన్ ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్‌ఐ కృష్ణబలి సింగ్ విధించినట్టుగా చెబుతున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రవాణా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద రూ.1,000 ఫైన్ వేస్తారు. కానీ అఫ్రోజ్‌కు మాత్రం రూ.1,00,000 జరిమానా విధించారు.

చలాన్ లక్ష వచ్చిందని అఫ్రోజ్ వాపోయాడు. ఇది మానవ తప్పిదం కారణంగా జరిగిందని జిల్లా రవాణా అధికారి శశిశేఖరం పేర్కొన్నారు. నిబంధనలకు మించి జరిమానా విధిస్తే తర్వాత సరిదిద్దుకోవచ్చని వెల్లడించారు.

హెల్మెట్ ధరించకపోతే ఫైన్ ఉండేది. ఇప్పుడు హెల్మెట్ సరిగా ధరించకపోవడం కూడా ట్రాఫిక్ నిబంధనల్లో చేర్చారు. అంతే కాదు ట్రాఫిక్ పోలీసులు రూ.1000 నుంచి రూ.2000 వరకు చలాన్లు కూడా జారీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనం నడిపే ముందు హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. దానికి ఉన్న స్ట్రిప్ కూడా సరిగా పెట్టుకోవాలి. లేదంటే ఫైన్ వేస్తారు. హెల్మెట్ ధరించిన తర్వాత స్ట్రిప్ వేసుకోవడం మర్చిపోవద్దు. చలాన్ల నుండి తప్పించుకోవడానికి హెల్మెట్లను ధరిస్తే సరిపోదు. సరిగా ధరించాలి.

Whats_app_banner

టాపిక్