Paytm outage : దేశవ్యాప్తంగా పేటీఎం సేవలకు అంతరాయం
Paytm outage : మీరు ఉదయం నుంచి పేటీఎంలో లావాదేవీలు చేయలేకపోతున్నారు? దేశవ్యాప్తంగా చాలా మందికి ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Paytm outage : దేశవ్యాప్తంగా పేటీఎం సేవలకు శుక్రవారం అంతరాయం ఏర్పడింది. చాలా మందికి పేటీఎం యాప్ పనిచేయలేదు. పేటీఎం ద్వారా లావాదేవీలు జరగడం లేదని ఫిర్యాదు వెల్లువెత్తాయి.
ఆన్లైన్ యాప్స్ సేవలను పరిశీలించే డౌన్డిటెక్టర్రు శుక్రవారం ఉదయం 10గంటల నాటికే 611 ఫిర్యాదులు అందాయి. ఫేటీఎం పనిచేయడం లేదని 66శాతం మంది వినియోగదారులు పేర్కొన్నారు. యాప్లో సమస్యలు ఉన్నట్టు 29శాతం మంది పేర్కొన్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై , బెంగళూరు వంటి నగరాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.
తమ యాప్లో నెట్వర్క్ సమస్యలు ఉన్నాయని పేటీఎం అంగీకరించింది. ఈ మేరకు ఉదయం 9:30కి ఓ ట్వీట్ చేసింది. తమ నిపుణుల బృందం సమస్య పరిష్కారానికి కృషిచేస్తున్నట్టు వివరించింది.
పేటీఎంలో తలెత్తిన సమస్యలను ఉదయం 11:30 సమయంలో సంస్థ పరిష్కరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు యాప్ ఎప్పటిలాగానే పనిచేస్తోంది. వినియోగదారులు లావాదేవీలు చేసుకోగలుగుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో 'పేటీఎండౌన్' హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి.
సంబంధిత కథనం
టాపిక్