Patanjali turnover: రూ. లక్ష కోట్లకు చేరనున్న పతంజలి గ్రూప్ టర్నోవర్..
Patanjali turnover: పతంజలి గ్రూపు టర్నోవర్ రూ. లక్ష కోట్లకు చేరనుందని బాబా రాందేవ్ ప్రకటించారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: వచ్చే 5-7 ఏళ్లలో పతంజలి గ్రూప్ టర్నోవర్ 2.5 రెట్లు పెరిగి రూ. 1 లక్ష కోట్లకు చేరుకుంటుందని, అలాగే తమ గ్రూప్ నుంచి నాలుగు కంపెనీల ప్రారంభ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో)ను కూడా ప్రారంభిస్తామని బాబా రామ్‌దేవ్ శుక్రవారం తెలిపారు.
రానున్న కాలంలో పతంజలి గ్రూప్‌లో 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
‘పతంజలి గ్రూప్ ప్రస్తుత టర్నోవర్ దాదాపు రూ. 40,000 కోట్లు. గ్రూప్ టర్నోవర్ 5-7 ఏళ్లలో లక్ష కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా’ అని రామ్‌దేవ్ ఇక్కడ విలేకరులతో అన్నారు.
పతంజలి గ్రూప్ సంస్థ పతంజలి ఫుడ్స్ (గతంలో రుచి సోయా గా ఉండేది) ఇప్పటికే స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయిందని, దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 50,000 కోట్లకు చేరుకుందని ఆయన చెప్పారు.
వచ్చే ఐదేళ్లలో మరో నాలుగు గ్రూప్ కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ (ఐపీఓ)లను ప్రారంభించనున్నామని రామ్‌దేవ్ తెలిపారు.
పతంజలి ఆయుర్వేద్, పతంజలి మెడిసిన్, పతంజలి లైఫ్ స్టైల్, పతంజలి వెల్‌నెస్ అనే నాలుగు కంపెనీలు ఐపీవోలకు వెళ్లనున్నాయి.
పతంజలి గ్రూప్ దివాలా ప్రక్రియ ద్వారా రుచి సోయాను రూ.4,300 కోట్లకు కొనుగోలు చేసింది. రుచి సోయా యొక్క ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO)ని తెచ్చింది. దానిని పతంజలి ఫుడ్స్ గా మార్చింది.
పతంజలి గ్రూప్ అన్ని ఉత్పత్తులు నాణ్యమైనవని రామ్‌దేవ్ నొక్కిచెప్పారు. దాని బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు మత, రాజకీయ, వైద్య, ఎంఎన్‌సీ "మాఫియాలు" ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు.
తమ గ్రూప్ 100 మందికి పైగా లీగల్ నోటీసులు ఇచ్చిందని, పోలీసులకు ఫిర్యాదులు చేసిందని చెప్పారు.
టాపిక్