Viral : అప్పడాలు ఎలా తయారు చేస్తారో తెలుసా? చూస్తే.. ఇక అస్సలు తినరు!
Papad Making Process : అప్పడాలు ఎలా తయారు చేస్తారో తెలుసా? ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది. వీడియో చూశాక.. మీరు ఇక అప్పడాలు తినడం మానేస్తారేమో!
Papad Making Process viral video : పప్పు అయినా, కూర అయినా, సాంబార్ అయినా.. పక్కన నంచుకోవడానికి అప్పడాలు లేకపోతే.. ఏదో వెలితిగా ఉంటుంది! ప్రతి భారతీయ కుటుంబాలు.. ఈ విషయాన్ని అంగీకరిస్తాయి. గ్రాసరీ లిస్ట్‌లో, పెళ్లిళ్లల్లో, ఈవెంట్స్‌లో.. అప్పడాలు లేకపోతే కష్టమే! క్రంచీగా, రుచికరంగా ఉంటే.. ఇక ఒకేసారి 4,5 కూడా నోట్లోకి వెళ్లిపోతాయి కదా! అంతా బాగుంది కానీ.. ఈ అప్పడాలను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? తయారు చేసే విధానాన్ని ఎప్పుడైనా చూశారా? ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూశాక.. ఇక ఎప్పటికీ అప్పడలు తినకూడదు! అని ఫిక్స్ అవుతారేమో!
అప్పడాలను ఇలా తయారు చేస్తారా..?
దబాకే ఖావ్ ( @dabake_khao) అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్.. ఈ వీడియోను షేర్ చేసింది. వీడియోలో తొలుత ఓ మహిళ కనిపించింది. ఆమె అప్పడాలు తయారు చేయడం మొదలుపెట్టింది. తొలుత.. అప్పడాల పిండిని తయారు చేసింది. ఆ తర్వాత ఉడకపెట్టడం మొదలుపెట్టింది. థిన్ షీట్స్గా వచ్చేంత వరకు భారీ ప్లేట్ మీద స్ప్రెడ్ చేసింది. అవి ఆరిన తర్వాత.. మరో మహిళ, వాటిని నేల మీద పరిచింది. ఆ తర్వాత.. గిన్నె పెట్టి, దాని మీద కాళ్లతో తొక్కడం మొదలుపెట్టింది. ఆ షార్ప్నెస్కి థిన్ షీట్స్‌పై మార్క్‌లు ఏర్పడ్డాయి. అనంతరం.. వాటిని చిన్న చిన్న సైజుల్లో కట్ చేసింది. ఇలా.. అప్పడాలు తయారయ్యాయి.
viral video Papad making process : అయితే.. చేతులకు ఏం ధరించకుండా అప్పడాలు చేయడంతో 'హైజీన్'పై ఆందోళన వ్యక్తం అవుతోంది. మరీ ముఖ్యంగా.. కాళ్లతో తొక్కుతుండటం చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. గాలికి వాటిని వదిలేయడాన్ని చూసి.. మళ్లీ వాటిని తినాలంటే భయపడుతున్నారు.
ఇదీ చూడండి :- Cockroaches in dosa : ప్లెయిన్ దోశ ఆర్డర్ చేస్తే.. ‘బొద్దింకల దోశ’ ఇచ్చారు! కస్టమర్ షాక్!
"శుభ్రత లేదు" అని ఒకరు కామెంట్ చేస్తే.. 'శుభ్రతా! అంటే ఏంటి?' అని ఇంకొకరు సెటైర్ వేశారు. ఇలా చాలా కామెంట్లు.. హైజీనిటీపైనే ఉన్నాయి. "ఇది పాత కాలం నాటి ప్రాసెస్. ఈ ప్రాసెస్ మారాలి," అని ఇంకొకరు చెప్పుకొచ్చారు.
అయితే.. కొందరు మాత్రం పాజిటివ్‌గానే కామెంట్స్ చేస్తున్నారు. "మనం తినే ఫాస్ట్ ఫుడ్ కన్నా ఇది బెటర్" అని ఓ వ్యక్తి రాసుకొచ్చారు. ఇంకొకరు.. "రోడ్డు మీద, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్‌తో పోల్చితే ఇది బెటరే. అప్పడాలు చేస్తున్న మహిళ.. దాని మీద డైరక్ట్‌గా కాలు వేయలేదు. సంతోషం!" అని కామెంట్ చేశారు.
మరి మీరేం అంటారు? ఈ అప్పడాల తయారీ ప్రాసెస్ చూసి మీరెలా ఫీల్ అయ్యారు?
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను ఇక్కడ చూసేయండి :
సంబంధిత కథనం