crime news : రేప్ ప్రయత్నాన్ని అడ్డుకుందని.. మహిళకు నిప్పంటించి!
Pakistan crime news : పాకిస్థాన్‌లో ఓ మహిళను, ఆమె ఇంట్లో అద్దెకి ఉండే వ్యక్తి రేప్ చేయడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో మహిళ శరీరానికి నిప్పంటించాడు!
Tenant sets woman on fire : పాకిస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో.. మహిళ శరీరానికి నిప్పంటించాడు!
ఇదీ జరిగింది..
పాకిస్థాన్ లాహోర్‌లోని డాజ్కోట్ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. కాషిఫ్ అనే వ్యక్తి.. ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఓనర్ ఇంట్లో ఓ మహిళ ఒంటరిగా ఉండటాన్ని గుర్తించాడు. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. కానీ ఆ మహిళ ప్రతిఘటించింది. కోపంతో ఊగిపోయిన నిందితుడు.. మహిళ శరీరానికి నిప్పంటించాడు.
మహిళ.. అరుపులతో స్థానికులు అలర్ట్ అయినట్టు సమాచారం. ఘటనాస్థలానికి పరుగులు తీసి ఆమెను రక్షించారు. అనంతరం ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం.. ఆ మహిళ, తీవ్ర గాయాలకు చికిత్స పొందుతున్నట్టు సమాచరం.
Pakistan crime news : ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు కాషిఫ్ని అరెస్ట్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు.. బాధితురాలి కుటుంబానికి హమీనిచ్చారు.
ఇదీ చూడండి:- Kerala crime news : మైనర్‌పై అత్యాచారం.. 80ఏళ్ల వృద్ధుడికి 45ఏళ్ల జైలు శిక్ష!
పాకిస్థాన్‌లో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజా ఘటనతో ఆందోళన మరింత పెరిగింది. మహిళల భద్రతకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
మరో ఘటనలో.. లాహోర్‌కు చెందిన ఓ మహిళ.. తన శరీరానికి నిప్పంటించుకుంది. కావెల్రీ గ్రౌండ్ ఏరియాలో ఇటీవల ఈ ఘటన జరిగింది. మహిళ.. తన మాజీ భర్త కార్యాలయం దగ్గరికి వెళ్లింది. అనంతరం నిప్పంటించుకుంది. స్థానికులు.. మంటలను ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Man sets woman on fire : మహిళ ఎందుకు అలా చేసింది? అన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ ఘటనపై దర్యాప్తు చేపట్టామని, మాజీ భర్తతో 8ఏళ్ల పాటు ఆమె కలిసి ఉందని, ఇతర వివరాలు త్వరలోనే తెలుస్తాయని పోలీసులు చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం