Kerala crime news : మైనర్​పై అత్యాచారం.. 80ఏళ్ల వృద్ధుడికి 45ఏళ్ల జైలు శిక్ష!-kerala crime news court sentences 80 year old man to cumulative 45 years jail term for raping minor girl ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kerala Crime News : మైనర్​పై అత్యాచారం.. 80ఏళ్ల వృద్ధుడికి 45ఏళ్ల జైలు శిక్ష!

Kerala crime news : మైనర్​పై అత్యాచారం.. 80ఏళ్ల వృద్ధుడికి 45ఏళ్ల జైలు శిక్ష!

Sharath Chitturi HT Telugu
Feb 23, 2024 07:20 AM IST

Kerala crime news : 80ఏళ్ల వృద్ధుడికి 45ఏళ్ల జైలు శిక్ష పడిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. నిందితుడు.. కొన్నేళ్ల క్రితం.. మైనర్​ని రేప్​ చేశాడు.

మైనర్​పై అత్యాచారం.. 80ఏళ్ల వృద్ధుడికి 45ఏళ్ల జైలు శిక్ష!
మైనర్​పై అత్యాచారం.. 80ఏళ్ల వృద్ధుడికి 45ఏళ్ల జైలు శిక్ష!

Kerala rape case : మైనర్​పై అత్యాచారం చేసిన ఓ 80ఏళ్ల వృద్ధుడికి కఠిన శిక్ష విధించింది కేరళ కోర్టు. ఆ వృద్ధుడు.. 45ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాలని తీర్పునిచ్చింది.

ఇదీ జరిగింది..

కేరళలోని ఇడుక్కీలో 2021లో జరిగింది ఈ ఘటన. బాధితురాలి తండ్రి మరణించాడు. బాలికను.. ఆమె తల్లి వదిలేసింది. ఆమెను.. తండ్రి తరఫు బంధువులు చేరదీసి, పెంచుతున్నారు. వారు ఇడుక్కీలోని ఓ ప్రాంతంలో నివాసముంటున్నారు. కాగా.. ఆ పక్కనే వృద్ధుడి దుకాణం ఉంది. ఓ రోజు.. బాలిక ఇంట్లో ఎవరు లేరని ఆయన తెలుసుకున్నాడు. ఆ వెంటనే.. ఇంట్లోకి ప్రవేశించి, బాలికపై అనేక మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

80 year old rape minor in Kerala : ఘటనపై తన బంధువులకు సమాచారం ఇచ్చింది బాధితురాలు. వారు పోలీసులను ఆశ్రయించారు. రేప్​ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వృద్ధుడిని అరెస్ట్​ చేశారు. తాజాగా.. ఈ ఘటనపై ఇడుక్కీ ఫాస్ట్​ ట్రాక్​ స్పెషల్​ కోర్టు జడ్జి జస్టిస్​ టీడీ వర్ఘీస్​.. తీర్పును వెలువరించారు. వివిధ కేసులకు గాను మొత్తం మీద 45ఏళ్ల పాటు జైలు శిక్షను విధించారు. అయితే.. ఈ 45ఏళ్లను వెంటవెంటనే అమలు చేయరు. తొలుత 20ఏళ్ల జైలు శిక్షను అమలు చేస్తారు.

అంతేకాకుండా.. నిందితుడిపై రూ. 60వేల జరిమానా సైతం విధించింది కోర్టు. ఆ డబ్బును బాధితురాలికి అప్పగించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఇక డిస్ట్రిక్ట్​ లీగల్​ సర్వీసెస్​ అథారిటీ కూడా.. పునరావాసం కోసం బాలికకు రూ. 50వేల డబ్బు ఇవ్వాలని సూచించింది.

Kerala crime news : బాలికపై అత్యాచారం కేసులో 80ఏళ్ల వృద్ధుడికి 45ఏళ్ల జైలు శిక్ష పడిన వార్త ప్రస్తుతం స్థానికంగా వార్తలకెక్కింది. బాధితురాలికి న్యాయం జరిగిందంటూ.. స్థానికులు సంబరాలు చేసుకున్నారు.

దిల్లీలో మైనర్​పై లైంగిక దాడి..

Delhi crime news : దిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 14ఏళ్ల మైనర్​పై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

దిల్లీలోని ఆనంద్​ పర్భత్​ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. బాలికపై లైంగిక దాడి జరిగిందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. కాగా.. 2021లో ఆ ఘటన జరిగినట్టు, బాలిక తాజాగా తన తల్లిదండ్రులకు ఆ విషయ చెప్పినట్టు తెలుసుకున్నారు. నిందితుడు.. 39ఏళ్ల వ్యక్తి అని, అతనికి స్థానికంగా కూరగాయల దుకాణం ఉందని తెలుసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. నిందితుడిని వెంటనే అరెస్ట్​ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం