Sandeshkhali violence : 'ఇంటింటికి వెళ్లి.. మహిళలను రేప్ చేశారు'- టీఎంసీ నేతలపై సంచలన ఆరోపణలు!
Sandeshkhali incident : పశ్చిమ్ బెంగాల్‌లోని సందేశఖలి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. స్థానిక టీఎంసీ సభ్యులపై రేప్, భూ దందా వంటి ఆరోపణలు చేస్తున్నారు ప్రజలు. ‘ఇంటింటికి వెళ్లి, అందమైన అమ్మాయిలను తీసుకుని రాత్రిళ్లు పార్టీ ఆఫీసుకు వెళతారు,’ అని మహిళలు ఆరోపిస్తున్నారు.
Sandeshkhali rape case: పశ్చిమ్ బెంగాల్‌లోని సందేశ్‌ఖలి ప్రాంతం.. గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. స్థానిక టీఎంసీ నేతల అక్రమాలు తట్టుకోలేక.. అక్కడి ప్రజలు తిరగబడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నేతలపై.. అత్యాచారం నుంచి భూ దంగా వరకు అనేక ఆరోపణలు చేస్తున్నారు అక్కడి ప్రజలు.
ఇదీ జరిగింది..
పశ్చిమ్ బెంగాల్‌లోని నార్త్ 24 పరగనాస్ జిల్లాలో ఉంటుంది ఈ సందేశ్‌ఖలి. సుందర్బన్స్లో ఇదొక చిన్న ద్వీపం. బంగ్లాదేశ సరిహద్దుకు అతి సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లాలంటే.. బోటు ఒక్కటే మార్గం!
ఇంత చిన్న ప్రాంతం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తలకెక్కింది. టీఎంసీ నేతలపై స్థానికులు, మరీ ముఖ్యంగా.. మహిళలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
"పార్టీ (టీఎంసీ) సభ్యులు ఇంటింటికి వెళతారు. అందమైన అమ్మాయి, అందమైన భార్య కోసం వెతుకుతారు. నచ్చితే.. వాళ్లని పార్టీ ఆఫీస్‌కు తీసుకెళతారు. ఒకటి కాదు రెండు కాదు.. చాలా రాత్రుళ్లు అక్కడే పెట్టుకుంటారు. వాళ్లు సంతృప్తి చెందే వరకు అక్కడే ఉంచుకుంటారు," అని ఓ మహిళ చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Sandeshkhali latest new : "పెళ్లి కాకుండా కొందరు.. భర్తలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకొందరు పురుషులు.. ఏం చేయలేక.. తమ భార్యలను వదులుకోవాల్సి వస్తోంది. మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇక్కడి మహిళలకు భద్రత లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు," అని మరో మహిళ చెప్పుకొచ్చింది.
"మహిళలను టీఎంసీ పార్టీ ఆఫీసుకు తీసుకెళతారు. రాత్రంతా అక్కడే పెట్టుకుని ఉదయం వదిలేస్తారు," అని ఇంకో మహిళ వివరించింది.
సందేశ్‌ఖలి ప్రజలు ఆరోపణల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు షేక్ షాజహాన్. ఆయన ఒక స్థానిక జిల్లా పరిషద్ సభ్యుడు. మహిళలందరు.. ఆయనే ప్రధాన నిందితుడు అని ఆరోపిస్తున్నారు. అత్యాచారాలు, లైంగిక దాడులే కాకుండా.. భూములు కూడా లాగేసుకున్నారని, ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
Sandeshkhali news : "షేక్ షాజహాన్, ఆయన సన్నిహితులు.. సందేశ్‌ఖలిలో బీభత్సం సృష్టిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సమాజ హక్కులను అనేకమార్లు ఉల్లంఘించారు. మహిళల భద్రతకు విఘాతం కలిగించారు. ప్రజల భూములను బలవంతంగా లాక్కున్నారు," అని బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి మండిపడ్డారు.
సందేశ్‌ఖలిలో రెండు రోజుల క్రితం హింసాత్మక ఘటన జరిగింది. టీఎంసీ సభ్యులకు వ్యతిరేకంగా పలు దుకాణాలను తగలబెట్టారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఆ ప్రాంతంలో మహిళలు చాలా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. చెప్పులు, లాఠీలు పట్టుకుని వారందరు రోడ్ల మీదకు వచ్చినట్టు సమచారం.
Sandeshkhali latest news : కాగా.. కేరళలో ఉన్న పశ్చిమ్ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్.. సందేశ్‌ఖలి ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే, అక్కడి నుంచి బయలుదేరారు. సోమవారం.. సందేశ్ఖలికు వెళుతుండగా.. టీఎంసీ కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత కనిపించింది.
తాజా పరిణామాలతో పశ్చిమ్ బెంగాల్లో రాజకీయ దుమారం చెలరేగింది. సీఎం మమతా బెనర్జీ మౌనంగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మమతా బెనర్జీ పాలనలో మహిళలకు భద్రత కరువైందని బీజేపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఎవరు ఈ షేక్ షాజహాన్..?
Sandeshkhali violence : ఈ షేక్ షాజహాన్.. ఒక పవర్ఫుల్ టీఎంసీ లీడర్ అని తెలుస్తోంది. వాస్తవానికి గత కొన్ని నెలలుగా ఆయన పరారీలో ఉన్నారు. జనవరిలో ఆయన ఇంట్లో రైడ్ చేయడానికి ఈడీ ప్రయత్నించింది. కానీ వందలాది మంది టీఎంసీ కార్యకర్తలు.. ఈడీ వాహనాలను అడ్డుకుంది గందరగోళం సృష్టించారు. అదే అదనుగా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పటివరకు ఆయన జాడ కనిపించడం లేదని సమాచారం.
సంబంధిత కథనం