Mahua Moitra expelled from Lok Sabha: లోక్ సభ నుంచి టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణ-mahua moitra expelled from lok sabha over cash for query allegation ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mahua Moitra Expelled From Lok Sabha: లోక్ సభ నుంచి టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణ

Mahua Moitra expelled from Lok Sabha: లోక్ సభ నుంచి టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణ

HT Telugu Desk HT Telugu
Dec 08, 2023 05:18 PM IST

Mahua Moitra expelled from Lok Sabha: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ను లోక్ సభ నుంచి బహిష్కరించారు. ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై లోక్ సభ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా

Mahua Moitra expelled from Lok Sabha: లోక్ సభలో ప్రశ్నలు అడగానికి డబ్బులు, బహుమతులు తీసుకున్నారన్న ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ఫైర్ బ్రాండ్ లీడర్ మహువా మొయిత్రా (Mahua Moitra) ను లోక్ సభ నుంచి బహిష్కరించారు. ఆ ఆరోపణలపై లోక్ సభ () ఎథిక్స్ కమిటీ శుక్రవారం సభకు తమ నివేదికను సమర్పించగానే, ప్రభుత్వం ఆమెను బహిష్కరించాలన్న తీర్మానాన్ని సభ ముందుకు తీసుకువచ్చింది.

ఆదానీపై ప్రశ్నలు..

లోక్ సభలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ఫైర్ బ్రాండ్ గా నిలిచారు. వివిధ అంశాలపై ప్రభుత్వం, అధికార బీజేపీ తీరును ప్రశంసనీయంగా ఎండగట్టేవారు. తన వాగ్ధాటితో సభను కట్టిపడేసేవారు. అయితే, తన లోక్ సభ లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ను పారిశ్రామిక వేత్త దర్శన్ హీరానందానీ కి ఆమె ఇచ్చారని, వాటి ద్వారా హీరానందానీ ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీకి సంబంధించి ఆరోపణలతో ప్రశ్నలు వేశారని, ఆమెపై ప్రధానమైన ఆరోపణ. అలా చేసినందుకు గానూ పారిశ్రామికవేత్త దర్శన్ హీరానందాని నుంచి ఆమె డబ్బు, ఖరీదైన బహుమతులు తీసుకున్నారన్నది మరో ఆరోపణ.

మహువా సమాధానం..

ఈ ఆరోపణలను బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకువెళ్లారు. స్పీకర్ ఓం బిర్లా ఈ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణకు ఆదేశించారు. శుక్రవారం ఆ కమిటీ తన నివేదికను లోక్ సభకు నివేదించింది. ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరించాలని ఆ కమిటీ సూచించింది. దాంతో, వెంటనే ఆమెను బహిష్కరించాలనే తీర్మానాన్ని ప్రభుత్వం సభ ముందుకు తీసుకువచ్చింది. ఆ నివేదికను అధ్యయనం చేసే సమయం కూడా ఇవ్వకపోవడంపై టీఎంసీ, కాంగ్రెస్ లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కనీసం సభలో మహువా మొయిత్రాకు తన వాదన వినిపించే అవకాశం ఇవ్వాలని కోరాయి. కానీ, స్పీకర్ అందుకు ఒప్పుకోలేదు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

సభ వెలుపల..

దాంతో, తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానాన్ని, సభలో తాను వినిపించాలనుకున్న వాదనను మహువా మొయిత్రా లోక్ సభ వెలువల, మీడియా ముందు వినిపించారు. లోక్ సభ లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఎవ్వరికీ ఇవ్వకూడదన్న నిబంధన ఏమీ లేదని ఆమె గుర్తు చేశారు. తను పారిశ్రామికవేత్త దర్శన్ నుంచి డబ్బులు, బహుమతులు తీసుకున్నట్లు కూడా ఆధారాలు లేవని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎంపీని లోక్ సభ నుంచి బహిష్కరించడంపై టీఎంసీ చీఫ్, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమత బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

IPL_Entry_Point