సోషల్ మీడియాలో స్నేహం.. మెట్రో స్టేషన్‌లో కలుసుకున్నాక అత్యాచారం-girl raped thrown near metro station by friend ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Girl Raped Thrown Near Metro Station By Friend

సోషల్ మీడియాలో స్నేహం.. మెట్రో స్టేషన్‌లో కలుసుకున్నాక అత్యాచారం

HT Telugu Desk HT Telugu
Feb 28, 2024 04:35 PM IST

బాలికపై అత్యాచారం చేసి మెట్రో స్టేషన్ సమీపంలో పడేసిన ఉదంతం ఇది.

స్నేహం పేరిట మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని అత్యాచారానికి పాల్పడిన ఉదంతం (ప్రతీకాత్మక చిత్రం)
స్నేహం పేరిట మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని అత్యాచారానికి పాల్పడిన ఉదంతం (ప్రతీకాత్మక చిత్రం)

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: నైరుతి ఢిల్లీలోని సాగర్పూర్ ప్రాంతంలోని డాబ్రీ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ బాలికపై ఆమె స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ట్రెండింగ్ వార్తలు

సోషల్ మీడియా ద్వారా మైనర్‌ బాలికతో పరిచయం పెంచుకున్న నిందితుడు స్నేహం పేరిట ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలు కోచింగ్ క్లాసుకు వెళ్లిందని, ఆ తర్వాత తన స్నేహితురాలిని కలిసేందుకు వెళుతున్నట్టు ఇంట్లో చెప్పిందని పోలీసులు తెలిపారు.

‘ఆమె తన సోషల్ మీడియా ఫ్రెండ్‌ను కలవాలని నిర్ణయించుకున్నట్లు మాకు తెలిసింది. ఆ తర్వాత ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మెట్రో స్టేషన్ సమీపంలో రేప్‌కు పాల్పడి కొట్టి అక్కడే పడేశాడు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది' అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

IPL_Entry_Point

టాపిక్