Google maps | గూగుల్ మ్యాప్స్‌తో `టోల్ ఫీ` వివ‌రాలు..!-now google maps will show estimated toll charges ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Now Google Maps Will Show Estimated Toll Charges

Google maps | గూగుల్ మ్యాప్స్‌తో `టోల్ ఫీ` వివ‌రాలు..!

HT Telugu Desk HT Telugu
Jun 15, 2022 05:18 PM IST

ఎప్ప‌టిక‌ప్పుడు లేటెస్ట్‌ అప్‌డేట్స్‌తో వ‌స్తున్న గూగుల్ మ్యాప్స్‌.. తాజాగా మ‌రో యూజ‌ర్ ఫ్రెండ్లీ అప్‌డేట్‌తో ముందుకు వ‌స్తోంది. ఇక‌పై ప్ర‌యాణాల్లో టోల్‌గేట్‌ల వ‌ద్ద మీరు చెల్లించ‌బోయే మొత్తాన్ని కూడా గూగుల్ మ్యాప్స్ మీకు చూపించ‌బోతోంది.

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

భార‌త్‌లో వాహ‌న‌దారుల‌కు గూగుల్ మ్యాప్స్ అందిస్తున్న స‌హ‌కారం అమూల్యం. తాజాగా, వాహ‌న‌దారుల‌కు గూగుల్ మ్యాప్స్ మ‌రో వెసులుబాటు క‌ల్పించ‌బోతోంది. ప్ర‌యాణాల్లో టోల్ గేట్లు ఇప్పుడు స‌ర్వ‌సాధార‌ణ‌మ‌య్యాయి. ఏ గేట్ వ‌ద్ద ఎంత చెల్లిస్తున్నామో, ఫాస్టాగ్ ద్వారా తెలుసుకోగ‌లుగుతున్నాం. కానీ, ఎంత చెల్లించ‌బోతున్నామో ముందే తెలుసుకోలేక‌పోతున్నాం. అందుకు గూగుల్ మ్యాప్స్ ఒక ప‌రిష్కారం చూప‌నుంది.

ట్రెండింగ్ వార్తలు

ముందే తెలుస్తుంది

భార‌త్‌లో గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచ‌ర్ యాడ్ అవుతోంది. అందులో మ‌న ప్ర‌యాణాల్లో మ‌నం రాబోయే టోల్‌గేట్ వ‌ద్ద చెల్లించ‌బోయే మొత్తాన్ని ముందే తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ ఆ వివ‌రాల‌ను ముందే మ‌న‌కు అంద‌జేస్తుంది. అంటే, ప్ర‌యాణం ప్రారంభించే ముందే, మ‌న మార్గంలో ఎన్ని టోల్‌గేట్స్ ఉన్నాయి? ఏ గేట్ వ‌ద్ద ఎంత మొత్తాన్ని చెల్లించాల్సి వ‌స్తుంది? అనే విష‌యాల‌ను గూగుల్ మ్యాప్స్‌లో చెక్ చేసుకోవ‌చ్చు. అంతేకాదు, మ‌నం వెళ్లే మార్గంలో టోల్ గేట్స్ ఏక్కువ‌గా ఉంటే, ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లేలా ప్లాన్ చేసుకోవ‌చ్చు.

ఎలా చెక్ చేయ‌డం..?

గూగుల్ మ్యాప్స్ డైరెక్ష‌న్స్ ఆప్ష‌న్లో కుడివైపు పైన ఉన్న మూడు డాట్స్‌ను ట్యాప్ చేయ‌డం ద్వారా ఈ సేవ‌లు పొంద‌వ‌చ్చు. అయితే, అందుకు, ముందుగా మీరు గూగుల్ మ్యాప్స్‌లేటెస్ట్ వ‌ర్ష‌న్‌కు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. మ‌రోవైపు, ఐ ఫోన్‌ల‌లోని ఇంటిలిజెంట్ వాయిస్ అసిస్టెంట్ `సిరి`తో కూడా గూగుల్‌మ్యాప్స్ ఇంటిగ్రేట్ అయింది.

యూఎస్ లో ఆల్రెడీ ఉంది..

ఈ సౌక‌ర్యం యూఎస్‌, ఇండోనేషియా, జ‌పాన్‌ల్లో ఇప్ప‌టికే ఉంది. ఆయా దేశాల్లో ఈ సంవ‌త్సరం ఏప్రిల్ నెల‌లో ఈ ఫీచ‌ర్‌ను గూగుల్ మ్యాప్స్‌లో యాడ్ చేశారు. ఇప్పుడు భార‌త్‌లో ప్రారంభించ‌బోతున్నారు. టోల్ గేట్స్ ఉన్న మార్గంతో పాటు ఇప్పుడు టోల్ గేట్స్ ఎక్కువ‌గా లేని, లేదా పూర్తిగా టోల్ ఫ్రీ మార్గాల‌ను కూడా గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. త‌ద్వారా త‌క్కువ ఖ‌ర్చు అయ్యే సులువైన మార్గాన్ని వాహ‌న‌దారుడు ఎన్నుకోవ‌చ్చు. అయితే, టోల్ ఛార్జ్ ఎంత అనేది? క‌చ్చితంగా చెప్ప‌లేమ‌ని, అంచనా మొత్తాన్ని మాత్ర‌మే చూప‌గ‌ల‌మ‌ని గూగుల్ చెబ్తోంది. టోల్ అథారిటీలు త‌మ‌కు ఇచ్చే స‌మాచారం ప్ర‌కారమే.. టోల్ ఫీ ఎంతో గూగుల్ మ్యాప్స్ చెబుతుంది.

ట్రాఫిక్ వివ‌రాలు కూడా..

ఇప్ప‌టికే గూగుల్ మ్యాప్స్.. మ‌నం ఎన్నుకున్న మార్గాల్లో రియ‌ల్ టైమ్‌ ట్రాఫిక్ వివ‌రాల‌ను, ఫాస్టెస్ట్ రూట్ వివ‌రాల‌ను అంద‌జేస్తోంది. టోల్ ఫ్రీ రూట్ల‌ను సూచించే స‌మ‌యంలోనూ ఈ వివ‌రాల‌తో పాటు, ఎక్కువ స‌మ‌యం ప‌ట్టే ప్ర‌మాదాన్ని కూడా ముందే హెచ్చ‌రిస్తుంది. త‌ద్వారా వాహ‌న‌దారుడు ఏ మార్గంలో వెళ్లాల‌నే విష‌యంలో ఒక నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు.

WhatsApp channel

టాపిక్