New Parliament inauguration row: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రావడం లేదన్న పార్టీలివే..-new parliament inauguration list of parties attending boycotting the event ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  New Parliament Inauguration: List Of Parties Attending, Boycotting The Event

New Parliament inauguration row: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రావడం లేదన్న పార్టీలివే..

HT Telugu Desk HT Telugu
May 24, 2023 05:56 PM IST

New Parliament inauguration row: ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ ఆవిష్కరణోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా, ప్రధాని స్వయంగా నిర్వహించడంపై ఇప్పటికే వివాదం ప్రారంభమైంది.

నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనం
నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనం

New Parliament: ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని (New Parliament building) ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ ఆవిష్కరణోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా, ప్రధాని స్వయంగా నిర్వహించడంపై ఇప్పటికే వివాదం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Who is to inaugrate New Parliament: రాజ్యాంగాధినేత రాష్ట్రపతి..

రాజ్యాంగాధినేత రాష్ట్రపతి కనుక పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్మునే ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదీకాక, దేశ శాసన వ్యవస్థ అధిపతి రాష్ట్రపతి అని, రాష్ట్రపతి, లోక్ సభ, రాజ్యసభలను కలిపి పార్లమెంట్ గా వ్యవహరిస్తారని, అందువల్ల పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అర్హత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకే ఉంటుందని విపక్షాలు వాదిస్తున్నాయి. ప్రధాని కేవలం కార్యనిర్వాహక వ్యవస్థకు సారధ్యం వహిస్తారు కనుక ఆయనకు పార్లమెంటును ప్రారంభించే అర్హత లేదని వివరిస్తున్నాయి. అలా కాకుండా, ప్రధాని మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తే, అది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, ప్రజాస్వామ్యంపై దాడిగా దాన్ని పరిగణించవచ్చని విమర్శిస్తున్నాయి.

Parties not attending: ఈ పార్టీలు హాజరు కావు

అయితే, పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాలని మొత్తం 19 విపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఆ మేరకు అవి బుధవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరు కాబోమని ప్రకటించిన పార్టీల్లో.. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సీపీఎం, సీపీఐ, ఆప్, శివసేన (ఉద్ధవ్ వర్గం), సమాజ్ వాదీ పార్టీ, జేఎంఎం, కేరళ కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్, రాష్ట్రీయ జనతాదళ్, ఎన్సీపీ, ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫెరెన్స్, ఆరెస్పీ, ఎండీఎంకే.. మొదలైనవి ఉన్నాయి.

Attending parties: హాజరవుతున్న పార్టీలు..

పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో పాటు శిరోమణి అకాలీదళ్, వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీ, శివసేన (షిండే వర్గం) తదితర పార్టీలు హాజరవుతున్నాయి. మరోవైపు, ఈ కార్యక్రమానికి హాజరవాలా? వద్దా? అనే విషయంపై మే 25న నిర్ణయం తీసుకుంటామని భారత రాష్ట్ర సమితి, మే 27 నిర్ణయం తీసుకుంటమని బీజేడీ తెలిపాయి. ఒకవేళ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటు నూతన భవనాన్నిప్రారంభిస్తే.. ఆ కార్యక్రమానికి హాజరవుతామని ఎంఐఎం తెలిపింది.

IPL_Entry_Point