New Parliament building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు-pm narendra modi expected to inaugurate new parliament building by month end ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Pm Narendra Modi Expected To Inaugurate New Parliament Building By Month End

New Parliament building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

HT Telugu Desk HT Telugu
May 16, 2023 08:57 PM IST

New Parliament building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

నెలాఖరులో ప్రధాని మోదీ ప్రారంభించనున్న కొత్త పార్లమెంటు భవనం
నెలాఖరులో ప్రధాని మోదీ ప్రారంభించనున్న కొత్త పార్లమెంటు భవనం

New Parliament building: ఎన్డీయే ప్రభుత్వానికి 9ఏళ్లు పూర్తైన సందర్భంగా కొత్త పార్లమెంటు భవనం ‘సెంట్రల్ విస్తా (CENTRAL VISTA)’ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనం (New Parliament building) లోనే జరగనున్నాయి. త్రిభుజాకారంలో ఉన్న ఈ పార్లమెంట్‌ను 1224 మంది ఎంపీలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

New Parliament building: 9వ వార్షికోత్సవాలు

బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి మే 26 నాటికి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే కొత్త పార్లమెంటు భవనాన్ని (New Parliament building) ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. 2014 లో తొలిసారి బీజేపీ నాయకత్వంలోని ఈ ఎన్డీయే ప్రభుత్వం మే 26వ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది. ఆ తరువాత 2019లో మే 30వ తేదీన రెండోసారి అధికార పగ్గాలు చేపట్టింది. ఈ సందర్భంగా ఉత్సవాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

New Parliament building: భవనం విశేషాలు..

కొత్త పార్లమెంటు భవనం (New Parliament building) 65 వేల చదరపు మీటర్ల వైశాల్యంతో రూపొందింది. ఇందులో లోక్ సభ (LOK SABHA), రాజ్యసభ (RAJYA SABHA) కార్యకలాపాల కోసం రెండు పెద్ద హాల్స్ ను నిర్మించారు. అలాగే, ఒక పెద్ద లైబ్రరీని, అత్యాధునిక కాన్స్టిట్యూషన్ హాల్ ను ఏర్పాటు చేశారు. చట్టసభల సభ్యుల కోసం ప్రత్యేక గదులు, పార్లమెంటు కమిటీల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. లోక్ సభ కార్యకలాపాల కోసం రూపొందించిన భారీ హాల్లో కనీసం 888 మంది ఎంపీలు కూర్చునే వీలుంది.అలాగే రాజ్యసభ హాళ్లో కనీసం 384 మంది సభ్యులు కూర్చోవచ్చు. లోక్ సభ హాల్ ను నెమలి (PEACOCK) ఆకృతిలో, రాజ్యసభ హాల్ ను కమలం పువ్వు (LOTUS) ఆకృతిలో రూపొందించారు.

New Parliament building: 2020లో శంకుస్తాపన

ఈ కొత్త పార్లమెంటు భవనానికి (New Parliament building) 2020 డిసెంబర్ లో, కరోనా విజృంభణ సమయంలో ప్రధాని మోదీ శంకుస్తాపన చేశారు. ఈ నాలుగు అంతస్తుల భవనానికి రూ. 970 కోట్ల నిర్మాణ వ్యయం అంచనా వేశారు. కరోనా కారణంగా ఈ నిర్మాణం ఆలస్యమైంది.

IPL_Entry_Point