విడాకుల తర్వాత ముస్లిం మహిళలు భరణానికి అర్హులు : సుప్రీంకోర్టు తీర్పు-muslim women entitled to alimony on divorce rules supreme court check more details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  విడాకుల తర్వాత ముస్లిం మహిళలు భరణానికి అర్హులు : సుప్రీంకోర్టు తీర్పు

విడాకుల తర్వాత ముస్లిం మహిళలు భరణానికి అర్హులు : సుప్రీంకోర్టు తీర్పు

Anand Sai HT Telugu
Jul 10, 2024 12:37 PM IST

Supreme Court : విడాకుల తర్వాత ముస్లిం మహిళలు భరణానికి అర్హులు అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. తమ భర్తల నుంచి మహిళలు భరణం పొందవచ్చని తెలిపింది.

భరణాలపై సుప్రీం కోర్టు తీర్పు
భరణాలపై సుప్రీం కోర్టు తీర్పు

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)లోని సెక్షన్ 125 ప్రకారం ముస్లిం మహిళలు తమ భర్తల నుండి భరణం పొందవచ్చని సుప్రీంకోర్టు బుధవారం ఒక తీర్పులో ధృవీకరించింది.

విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు తమ భర్తల నుండి ఆర్థిక సహాయాన్ని క్లెయిమ్ చేసే హక్కును కలిగి ఉంటారని కోర్టు తీర్పు చెప్పింది. ఇది పౌరులందరికీ చట్టం ప్రకారం సమానత్వం, రక్షణ సూత్రాన్ని బలపరుస్తుంది. మతంతో సంబంధం లేకుండా.. సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. విడాకుల తర్వాత ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చని పేర్కొంది.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 125 ప్రకారం.. విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ.. ఓ ముస్లిం వ్యక్తి పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బీబీ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

ముస్లిం మహిళల (విడాకుల హక్కుల పరిరక్షణ) చట్టం, 1986లోని నిబంధనలు CrPC ఏర్పాటు చేసిన లౌకిక చట్టాన్ని అతిక్రమించవని ఈ నిర్ణయం స్పష్టం చేసింది. తన మాజీ భార్యకు రూ. 10,000 భరణం చెల్లించాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ముస్లిం వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. ముస్లిం మహిళ హక్కును సమర్థిస్తూ ధర్మాసనం తీర్పులు వెలువరించింది.

సెక్షన్ 125 CrPC కింద ఏదైనా దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు, ఒక ముస్లిం మహిళ విడాకులు తీసుకుంటే, ఆమె ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019ని ఆశ్రయించవచ్చని కూడా కోర్టు తీర్పు చెప్పింది. 'సెక్షన్ 125 సీఆర్‌పీసీ వివాహిత మహిళలందరికీ వర్తిస్తుందనే ప్రధాన ముగింపుతో మేం క్రిమినల్ అప్పీల్‌ను తోసిపుచ్చుతున్నాం' అని న్యాయమూర్తి నాగరత్న అన్నారు.

WhatsApp channel

టాపిక్