BNS First Case : కొత్త క్రిమినల్ చట్టం ప్రకారం పరిష్కరించిన మెుదటి కేసు ఇదే
BNS First Case Solved : జులై 1 నుంచి దేశంలో కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి. అయితే ఈ చట్టం కింద నమోదైన మెుదటి కేసు పరిష్కరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
భారతదేశంలో జులై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(BNSS) 2023, భారతీయ న్యాయ సంహిత(BNS) 2023, భారతీయ సాక్ష్యా అధినియం(BSA) 2023 అనే మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఈ చట్టాలు తీసుకువచ్చారు.
బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టం కింద నమోదైన భారతదేశపు మొదటి ఎఫ్‌ఐఆర్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పరిష్కరించారు. మోటర్ సైకిల్ దొంగతనానికి సంబంధించిన ఈ కేసు కొత్త క్రిమినల్ చట్టం కింద మెుదటిది. అందుకే దీనిపై ఆసక్తిగా సహజంగానే అందరికీ ఉంది. మోటారుసైకిల్ దొంగతనంలో కొత్త చట్టం ప్రకారం దేశంలోని మొదటి కేసు. తర్వాత స్థానిక పోలీసులు తీసుకున్న వేగవంతమైన చర్యలతో ఈ కేసు ఎక్కువగా వార్తల్లో నిలిచింది.
కొత్త చట్టం ప్రకారం మొదటి ఎఫ్‌ఐఆర్ ఢిల్లీలోని వీధి వ్యాపారిపై కాదని, గ్వాలియర్‌లో మోటార్‌సైకిల్ దొంగతనానికి సంబంధించినదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన తర్వాత ఈ కేసు బాగా హైలెట్ అయింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మా పీతాంబర కాలనీలోని తన ఇంటి వెలుపల పార్క్ చేసిన తన యమహా స్పోర్ట్స్ బైక్ దొంగిలించారని సౌరభ్ నర్వారియా ఫిర్యాదు చేశాడు. దాదాపు రూ.1.8 లక్షల విలువైన బైక్‌ను ఫిర్యాదుదారు కుటుంబీకులు తమ కుమారుడి పేరిట కాకుండా నర్వారియా పేరుతోనే కొనుగోలు చేశారు. పోలీసు విచారణ వారిని ఫిర్యాదుదారు బంధువు సచిన్ నర్వారియా వద్దకు తీసుకెళ్లాయి. వారి బంధువే బైక్ దొంగిలించినట్టుగా తేల్చారు. అతను నకిలీ కీలను ఉపయోగించి బైక్‌ను దొంగిలించినట్లు అంగీకరించాడు.
పోలీసు వివరాల ప్రకారం.. గ్వాలియర్‌లోని హజీరా పోలీస్ స్టేషన్‌లో BNS సెక్షన్ 303(2) (దొంగతనం) కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. తర్వాత విచారణ చేయగా వారి బంధువే నకిలీ కీతో బైక్‌ను దొంగిలించినట్టుగా తేలింది. జులై 1 నుండి అమలులోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం దేశంలో తొలి కేసును పరిష్కరించారు.
టాపిక్