IMD rain alert : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). ఉత్తరాఖండ్, ఉత్తర ఉత్తర్ ప్రదేశ్, సిక్కిం, ఈశాన్య భారతంతో పాటు పలు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
అతి భారీ వర్షాల నేపథ్యంలో నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, అసోం, మేఘాలయ, బిహార్, తూర్పు ఉత్తర్ ప్రదేశ్‌లకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మంగళవారం ఢిల్లీలో వాతావరణం మేఘావృత్తమై ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగాను, కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలగను నమోదవుతుంది ఐఎండీ వెల్లడించింది. వర్షం పడే అవకాశం తక్కువేనని స్పష్టం చేసింది.
మరోవైపు తూర్పు ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లో బుధవారం అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది ఐఎండీ. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్‌ను సైతం జారీ చేసింది.
Uttar Pradesh rains : ఐఎండీ ప్రకారం.. ఉత్తరాఖండ్‌లో ఈ నెల 10 వరకు, ఉత్తర ప్రదేశ్‌లో ఈ నెల 9 వరకు విస్తృతంగా వానలు పడతాయి. తూర్పు, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత 7 రోజుల పాటు వర్షాలు తగ్గుముఖం పడతాయి.
బిహార్, ఝార్ఖండ్‌లో మంగళవారం అతి భారీ వానలు కురుస్తాయి. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కచ్చితంగా పడతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
Manipur rains : ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు సంబంధించి.. దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వెల్లడించింది. జులై వరకు వరదలతో అతలాకుతలమైన ప్రాంతాలకు ఇది కాస్త ఊరటనిచ్చే వార్త!
రుతుపవనాల రెండో భాగంలోనూ ఎల్నీనో ప్రభావం ఉండదని ఐఎండీ పేర్కొంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆగస్ట్ నెలలో సాధారణం కన్నా తక్కువ వర్షాలు పడతాయని వివరించింది.
సంబంధిత కథనం