Manipur violence case : మణిపూర్​ హింస కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!-manipur violence case sc sets up panel of 3 former women hc judges to look into relief rehabilitation ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Manipur Violence Case : మణిపూర్​ హింస కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

Manipur violence case : మణిపూర్​ హింస కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

Sharath Chitturi HT Telugu
Aug 07, 2023 05:07 PM IST

Manipur violence case : మణిపూర్​ హింసకు సంబంధించి పలు కీలక ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. పలు కేసులకు సంబంధించి విచారణ చేపట్టిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

మణిపూర్​ హింసపై సూప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
మణిపూర్​ హింసపై సూప్రీంకోర్టు కీలక ఆదేశాలు..! (HT_PRINT)

Manipur violence case : మణిపూర్​ హింసకు సంబంధించిన కేసులపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పలు కీలక ఆదేశాలు వెలువరించింది. బాధితుల పునారావసం, ఉపశమనం కల్పించే కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు మాజీ న్యాయమూర్తులను నియమిస్తున్నట్టు ప్రకటించింది.

ఈ కమిటీలో జమ్ముకశ్మీర్​ మాజీ సీజే జస్టిస్​ గీత మిట్టల్​తో పాటు రిటైర్డ్​ జస్టిస్​ షాలిని పీ జోషి, జస్టిస్​ ఆశా మేనన్​లు ఉంటారని సీజేఐ డీవై చంద్రచూడ్​తో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ కమిటీకి జస్టిస్​ గీత మిట్టల్​ నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. మణిపూర్​లో శాంతిభద్రతలను పునరుద్ధరించి, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు ఈ చర్యలు చేపడుతున్న ధర్మాసనం వెల్లడించింది.

Manipur violence case Supreme court : పునరావాస కార్యకలాపాలను చూసేందుకు కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు.. రాష్ట్రంలో దాఖలైన క్రిమినల్​ కేసులను విచారిస్తున్న సిట్​ బృందాలను పర్యవేక్షించేందుకు సీనియర్​ అధికారులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. మరోవైపు వివిధ రాష్ట్రాల నుంచి కనీసం డిప్యూటీ ఎస్​పీ స్థాయి ఆఫీసర్లను సీబీఐ తన దర్యాప్తులో చేర్చుకోవాలని తెలిపింది. అంతేకాకుండా సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులను మాజీ ఐపీఎస్​ అధికారి దత్తాత్రేయ పద్​సల్గిర్కర్​ పర్యవేక్షిస్తామని చెప్పింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం సాయంత్రం నాటికి సుప్రీంకోర్టు వెబ్​సైట్​లో పెడతామని స్పష్టం చేసింది.

మణిపూర్​ హింసతో పాటు పునరావాస కార్యక్రమాలు వంటి 10కిపైగా కేసులను సోమవారం విచారించింది సుప్రీంకోర్టు.

'ప్రభుత్వం చాలా మెచ్యూర్​గా హ్యాండిల్​ చేస్తోంది..!'

సోమవారం జరిగిన విచారణకు మణిపూర్​ డీజీపీ రాజివ్​ సింగ్​ హాజరయ్యారు. రాష్ట్రంలో తెగల మధ్య ఘర్షణలు, వాటిని అడ్డుకునేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. మెరుగైన విచారణ కోసం కేసుల విభజనకు సంబంధించిన వివరాలను సైతం కోర్టుకు వెల్లడించారు.

Manipur violence latest news : కేంద్ర ప్రభుత్వం తరఫు వాదనలు వినిపించారు అటార్నీ జనరల్​ ఆర్​ వెంకరమణ, సోలసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా. "మణిపూర్​ హింస విషయంలో కేంద్ర ప్రభుత్వం పరిణతితో ప్రవర్తిస్తోంది," అని న్యాయవాదులు అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం