Monsoon session: పార్లమెంట్​లో కొనసాగుతున్న వాయిదాల పర్వం-monsoon session rajya sabha adjourned till 2 pm amid oppn protest against inflation gst hike ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Monsoon Session: పార్లమెంట్​లో కొనసాగుతున్న వాయిదాల పర్వం

Monsoon session: పార్లమెంట్​లో కొనసాగుతున్న వాయిదాల పర్వం

Sharath Chitturi HT Telugu
Jul 19, 2022 01:28 PM IST

Parliament Monsoon Session : పార్లమెంట్​ సమావేశాలు మరోమారు వాయిదా పడ్డాయి. విపక్షాల నిరసనల మధ్య ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.

<p>పార్లమెంట్​లో కొనసాగుతున్న వాయిదాల పర్వం</p>
పార్లమెంట్​లో కొనసాగుతున్న వాయిదాల పర్వం (HT Telugu)

Parliament Monsoon Session : పార్లమెంట్​​ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాల ఆందోళనల మధ్య తొలిరోజైన సోమవారం మొత్తానికే వాయిదా పడగా.. మంగళవారం కూడా అదే పరిస్థితి నెలకొంది. ద్రవ్యోల్బణం, జీఎస్​టీ రేట్ల పెంపుపై విపక్షాల నినాదాల మధ్య రాజ్యసభ, లోక్​సభ మధ్యహ్నం 2గంటల వరకు వాయిగా పడ్డాయి.

అగ్నిపథ్​ పథకానికి వ్యతిరేకంగానూ ఎంపీలు నిరసనలకు దిగారు. 'నిబంధనల ప్రకారం ప్లకార్డులు.. సభ లోపలికి తీసుకురాకూడదు,' అంటూ లోక్​సభను వాయిదా వేశారు స్పీకర్​ ఓం బిర్లా.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. ఆహార ఉత్పత్తులు, ప్రభుత్వ సేవలన్నింటిపైనా జీఎస్​టీ విధించాలన్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ.. పార్లమెంట్​ ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో టీఆర్​ఎస్​ పార్లమెంటరీ పార్టీ నేతలు పాల్గొన్నారు. కె.కేశవ రావు, లోక్​సభ పక్ష నేత నామా నాగేశ్వరరావుతో పాటు ఇతర లోక్​సభ, రాజ్యసభ సభ్యులతో ధర్నాకు దిగారు.

సోమవారం మొదలైన పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు.. ఆగస్టు 12తో ముగియనున్నాయి. ఈ దఫా సమవేశాలు.. కీలకంగా మారాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఫలితలు ఈ దఫా వర్షాకాల సమావేశాల్లోనే ఉండనున్నాయి. వీటితో పాటు.. మొత్తం మీద 32 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది.

శ్రీలంకపై అఖిలపక్ష సమావేశం..

Sri Lanka crisis : శ్రీలంక సంక్షోభంపై మంగళవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరగనుంది. శ్రీలంక పరిణామాలపై భారత దేశ వైఖరి, ఆర్థిక సాయం వంటి చర్యలపై విపక్షాలకు విదేశాంగమంత్రి జై శంకర్​, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ వివరించనున్నారు.

శ్రీలంకను కుదిపేస్తున్న ఆర్థిక సంక్షోభం విషయంలో భారత్ జోక్యం అవసరమని డిఎంకే, అన్నాడీఎంకే నేతలు డిమాండ్ చేసిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం.

Whats_app_banner

సంబంధిత కథనం