Kota suicide news : ‘అమ్మ- నాన్న.. జేఈఈ నా వల్ల కావట్లేదు’- కోటాలో విద్యార్థిని ఆత్మహత్య!
JEE student suicide in Kota : రాజస్థాన్ కోటాలో ఈ ఏడాది కూడా విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా.. జేఈఈ పరీక్షకు కొన్ని రోజుల ముందు.. ఓ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది.
Kota student death news : ఏడాది మారింది కానీ.. రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు! తాజాగా.. ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుని ప్రాణాలు తీసుకుంది. 'నా వల్ల కావడం లేదు,' అని తల్లిదండ్రులకు లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
ఇదీ జరిగింది..
రాజస్థాన్ కోటాలో.. ఓ 18ఏళ్ల విద్యార్థిని జేఈఈ కోసం చదువుకుంటోంది. జనవరి 31న ఆమె పరీక్ష రాయాల్సి ఉంది. ఇంతలో ఆమె సూసైడ్ చేసుకుంది. ఆమె ఉంటున్న గదిలోకి వెళ్లిన పోలీసులకు ఓ సూసైడ్ నోట్ కనిపించింది.
"అమ్మ, నాన్న. జేఈఈ నా వల్ల కావడం లేదు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను లూజర్‌ని. ఓటమికి నేనే కారణం. నేను మంచి కూతురిని కాదు. అమ్మ- నాన్న. నన్ను క్షమించండి. ఇదే నా చివరి ఆప్షన్," అని ఆ సూసైడ్ నోట్లో రాసి ఉంది.
Kota student suicide note : ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 18ఏళ్ల జేఈఈ విద్యార్థిని సూసైడ్ నోట్ చూసి నెటిజెన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చాలా మందికి.. ఆ నోట్ కన్నీరు పెట్టిస్తోంది.
కోటాలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం.. ఈ ఏడాదిలో ఇది ఇప్పటికే రెండోది! జనవరి 23న.. మహమ్మద్ జైద్ అనే వ్యక్తి తన ప్రాణాలు తీసుకున్నాడు. నీట్ కోచింగ్ కోసం కోటాకు వెళ్లిన అతను.. తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు.
Kota latest news : జేఈఈ, నీట్ కోచింగ్‌లో.. ఒకప్పుడు టాపర్స్, ర్యాంకర్స్ని సృష్టించిన కోటా.. ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలతో వార్తలకెక్కుతోంది. గతేడాది 25కుపైగా మంది విద్యార్థులు మరణించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని కోటా కోచింగ్ సెంటర్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో.. అధికారులు సైతం.. విద్యార్థులకు సాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
సంబంధిత కథనం