JEE Main 2024 Session 1 exam: రేపటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్ష; ఈ విషయాలు మర్చిపోకండి..
JEE Main 2024 Session 1 exam: జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 1 పరీక్ష 2024 జనవరి 24న ప్రారంభం కానుంది. అడ్మిట్ కార్డు, ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఎగ్జామ్ డే గైడ్ లైన్స్ ను ఇక్కడ చెక్ చేసుకోండి.
JEE Main 2024 Session 1 exam: జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 పరీక్షలు 2024 జనవరి 24వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ పరీక్షలు 2024 జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరుగుతాయి. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది.
అడ్మిట్ కార్డు
జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 (JEE Main 2024 Session 1) పరీక్షకు సంబంధించి బీ. ప్లానింగ్ (B.Planning) లేదా పేపర్ 2 అడ్మిట్ కార్డును జేఈఈ అధికారిక వెబ్ సైట్ లో ఇప్పటికే విడుదల చేశారు. పేపర్ 2ఏ (B. Arch), పేపర్ 2బీ (B. Planning), పేపర్ 2ఏ అండ్ 2బీ (B. Arch & B. Planning) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డును ఇక్కడ ఇచ్చిన https://jeemain.ntaonline.in/frontend/web/advancecityintimationslip/admit-card డైరెక్ట్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన డాక్యుమెంట్లు
ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ ఈ క్రింద జాబితాలోని పత్రాలను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డు ప్రింట్ కాపీతో పాటు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న సెల్ఫ్ డిక్లరేషన్ ను నింపి తీసుకువెళ్లాలి.
- పరీక్ష సమయంలో సెంటర్ లోని అటెండెన్స్ షీట్ లోని నిర్దిష్ట స్థలంపై అతికించడానికి ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటోను తీసుకువెళ్లాలి.
- అధీకృత ఫోటో ఐడీలలో ఏదైనా ఒకటి (ఒరిజినల్, చెల్లుబాటు అయ్యేది మరియు గడువు తీరనిది) - పాఠశాల గుర్తింపు కార్డు / పాన్ కార్డు / డ్రైవింగ్ లైసెన్స్ / ఓటర్ ఐడి / పాస్ పోర్ట్ / ఆధార్ కార్డు (ఫోటోతో)/ ఫోటో ఉన్న రేషన్ కార్డు / ఫోటో ఉన్న 12 వ తరగతి బోర్డు అడ్మిట్ కార్డు / ఫోటో ఉన్న బ్యాంక్ పాస్ బుక్.
- ట్రాన్స్ పరెంట్ బాల్ పాయింట్ పెన్
- దివ్యాంగ విద్యార్థులు అధీకృత వైద్యాధికారి జారీ చేసిన పిడబ్ల్యుడి సర్టిఫికేట్ ను తీసుకువెళ్లాలి.
కచ్చితంగా పాటించాల్సిన గైడ్ లైన్స్
- పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి 2 గంటల ముందు పరీక్షా కేంద్రానికి రిపోర్ట్ చేయాలి.
- పరీక్ష హాల్ తెరిచిన వెంటనే అభ్యర్థులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. ప్రతి అభ్యర్థికి రోల్ నంబర్ సూచించే సీటు కేటాయిస్తారు. అభ్యర్థులు తమకు కేటాయించిన సీట్లలో మాత్రమే కూర్చొని కూర్చోవాలి.
- అభ్యర్థి పరీక్ష గదిలో ప్రవేశించేముందు అడ్మిట్ కార్డును చూపించాలి.
- కంప్యూటర్లో అందుబాటులో ఉన్న ప్రశ్నపత్రం అడ్మిట్ కార్డులో సూచించిన సబ్జెక్టుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.
- పరీక్ష సమయంలో ఏదైనా సాంకేతిక సహాయం, ప్రథమ చికిత్స అత్యవసర లేదా ఏదైనా ఇతర సమాచారం కోసం అభ్యర్థులు గదిలోని సెంటర్ సూపరింటెండెంట్ / ఇన్విజిలేటర్ ను సంప్రదించవచ్చు.