Crime news : వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్య.. చేతిలో సూసైడ్​ నోట్​ రాసుకుని!-palghar woman ends life husband father in law held on charges of dowry death ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్య.. చేతిలో సూసైడ్​ నోట్​ రాసుకుని!

Crime news : వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్య.. చేతిలో సూసైడ్​ నోట్​ రాసుకుని!

Sharath Chitturi HT Telugu
Oct 15, 2023 11:05 AM IST

Maharashtra crime news : వరకట్న వేధింపులకు మరో మహిళ బలైంది! అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక.. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.

వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్య.. చేతిలో సూసైడ్​ నోట్​ రాసుకుని!
వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్య.. చేతిలో సూసైడ్​ నోట్​ రాసుకుని!

Maharashtra crime news : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వరకట్న వేధింపులను తట్టుకోలేక పోయిన ఓ మహిళ.. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది.

ఇదీ జరిగింది..

మహారాష్ట్ర పాల్​గఢ్​ జిల్లాలో జరిగింది ఈ ఘటన. నల్లా సోపారా అనే ప్రాంతానికి చెందిన వ్యక్తితో.. 2022 మేలో 24ఏళ్ల మహిళకు వివాహమైంది. అతను.. ఓ ప్రైవేట్​ కంపెనీలో ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు.

పెళ్లి జరిగిన రెండు నెలలకే.. ఆ మహిళ, తన ప్రశాంతతను కోల్పోయింది. 'ఇంటి నుంచి రూ. 5లక్షలు తీసుకురా' అని మహిళపై ఆమె భర్త తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. కానీ మహిళ తరఫు కుటుంబసభ్యులు వరకట్నం డబ్బులు ఇవ్వలేకపోయారు.

ఈ క్రమంలో.. మహిళ, తన తండ్రితో తన బాధను పంచుకుంది.

Woman suicide in Maharashtra : "ఓసారి నేను నా కూతురికి ఫోన్​ చేశాను. వరకట్నం కోసం అందరు వేధిస్తున్నారని చెప్పింది. కొడుతున్నారని కన్నీరు పెట్టుకుంది. ఇక తట్టుకోలేదని చెప్పింది," అని ఆ మహిళ తండ్రి తెలిపారు.

ఈ క్రమంలో.. శుక్రవారం సాయంత్రం మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింట్లో.. ఫ్యాన్​కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషయాన్ని స్థానికులు.. బాధితురాలి తండ్రికి ఫోన్​ చేసి చెప్పారు.

Dowry harassment case Maharashtra : మరోవైపు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పరిశీలిస్తుండగా.. చేతిలో కొన్ని అక్షరాలు కనిపించాయి. తన చావుకు కారణం, తన భర్త, అత్తామామలేనని చేతిలో రాసుకుని ఆ మహిళ ప్రాణాలు విడిచింది.

అదే సమయంలో.. పోలీస్​ స్టేషన్​కు వెళ్లి, ఫిర్యాదు చేశాడు బాధితురాలి తండ్రి. ఘటనపై కసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళ భర్తతో పాటు అతని తండ్రిని కూడా అరెస్ట్​ చేశారు.

ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను శిక్షిస్తామని మహిళ కుటుంబానికి పోలీసులు హామీనిచ్చారు.

నీట్​ విద్యార్థినిపై అత్యాచారం..

దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా.. మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు ఆందోళనకరంగా మారాయి. రాజస్థాన్​ కోటాలో నీట్​ కోచింగ్​ తీసుకుంటున్న ఓ విద్యార్థినిపై ఓ టిఫిన్​ డెలివరీ బాయ్​ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది.

బిహార్​కు చెందిన ఓ 15ఏళ్ల బాలిక.. నీట్​ కోచింగ్​ కోసం రాజస్థాన్​ కోటాకు వెళ్లింది. అక్కడి ఓ హాస్టల్​లో.. తన సోదరితో కలిసి జీవిస్తోంది. కాగా.. గత ఫిబ్రవరిలో.. ఆమెను ఓ టిఫిన్​ బాయ్​ కలిశాడు. ఫుడ్​ డెలివరీ చేసేందుకు వచ్చి మాటలు కలిపాడు. అలా.. వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. కొద్ది రోజులు మాట్లాడుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం