PAN - Aadhaar link: పాన్ - ఆధార్ లింక్ లాస్ట్ డేట్ మే 31; పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ హెచ్చరిక
PAN - Aadhaar link: ఆధార్ తో పాన్ ను అనుసంధానించడానికి ఆఖరు తేదీ మే 31 అని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్లు 206 ఏఏ, 206 సీసీ కింద అధిక టీడీఎస్ ను నివారించడానికి పన్ను చెల్లింపుదారులు 2024 మే 31 లోగా తమ పాన్ ను ఆధార్ తో లింక్ చేయాల్సి ఉంటుంది.
PAN - Aadhaar link: పన్ను చెల్లింపుదారులు 2024 మే 31 లోగా తమ పర్మనంట్ అకౌంట్ నంబర్ (PAN) ను ఆధార్ తో లింక్ చేయాలని ఆదాయ పన్ను శాఖ రిమైండర్ జారీ చేసింది. ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేయబడిన రిమైండర్, అధిక టీడీఎస్(టిడిఎస్) ను నివారించడానికి పాన్ - ఆధార్ లింక్ తప్పని సరి అని స్పష్టం చేసింది.
ఐటీ శాఖ హెచ్చరిక
పాన్ - ఆధార్ లింక్ నకు గడువు విషయంలో పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేయడానికి మంగళవారం ఆదాయ పన్ను ట్విటర్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పోస్ట్ లను షేర్ చేసింది. పాన్ ను ఆధార్ తో లింక్ చేయడంలో విఫలమైతే టీడీఎస్ రేటు పెరుగుతుందని ఆ పోస్ట్ ల్లో పేర్కొంది.
గడువు మిస్ కావడం వల్ల చిక్కులు
మే 31వ తేదీలోగా పాన్ (PAN), ఆధార్ (Aadhaar) లను అనుసంధానం చేయనివారి టీడీఎస్ పెరుగుతుందని ఆదాయ పన్ను శాఖ హెచ్చరించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) 2024 ఏప్రిల్ 23 న జారీ చేసిన మునుపటి సర్క్యులర్లో పాన్-ఆధార్ అనుసంధానానికి సంబంధించిన అన్ని నిబంధనలు ఉన్నాయి. పాన్, ఆధార్ లను అనుసంధానం చేయకపోతే వచ్చే చిక్కులు కూడా అందులో వివరించారు.
పాన్ ను ఆధార్ తో లింక్ చేయడం ఎలా?
పాన్ ను ఆధార్ తో లింక్ చేయడం కోసం ఈ కింది స్టెప్స్ ఫాలో కండి.
- ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ incometaxindiaefiling.gov.in ను ఓపెన్ చేయండి.
- 'క్విక్ లింక్స్' విభాగానికి వెళ్లి 'లింక్ ఆధార్' ఆప్షన్ ఎంచుకోవాలి.
- మీ పాన్, ఆధార్ నంబర్ ను ఇన్ పు ట్ చేసి, ఆపై 'వాలిడేట్' బటన్ పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ కార్డు లో ఉన్న విధంగా మీ పేరును నమోదు చేయండి. ఆపై 'లింక్ ఆధార్' బటన్ పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు పంపిన ఓటీపీని ఎంటర్ చేయండి.
- 'వాలిడేట్' బటన్ పై క్లిక్ చేయండి.
పాన్, ఆధార్ లింకేజీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
- ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ incometaxindiaefiling.gov.in ను ఓపెన్ చేయండి.
- 'క్విక్ లింక్స్' సెక్షన్ కింద 'లింక్ ఆధార్ స్టేటస్' ఆప్షన్ ను ఎంచుకోండి.
- మీ పాన్, ఆధార్ నంబర్లను ఎంటర్ చేసి, 'వ్యూ లింక్ ఆధార్ స్టేటస్' బటన్ పై క్లిక్ చేయండి.
- విజయవంతమైన ధృవీకరణ తర్వాత మీ పాన్ - ఆధార్ లింకేజీ స్థితి స్క్రీన్ పై కనిపిస్తుంది.
- యూఐడీఏఐ ఇప్పటికే మీ అభ్యర్థనను ప్రాసెస్ చేసి ఉంటే, మీ ఆధార్, పాన్ అనుసంధానం పూర్తి అయినట్లుగా కనిపిస్తుంది.