Woman married brother : సోదరుడిని పెళ్లి చేసుకున్న మహిళ.. కారణం తెలిస్తే షాక్!
Woman married brother in UP : ఉత్తర్ ప్రదేశ్‌లో.. ఓ మహిళ, తన సొంత సోదరుడిని పెళ్లి చేసుకుంది! అసలు విషయం తెలిసిన వారందరు షాక్ అవుతున్నారు.
Uttar Pradesh Woman married brother : ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ.. తన సొంత సోదరుడిని పెళ్లి చేసుకుంది! ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ యోజనలో భాగంగా అందే డబ్బులు, బహుమతుల కోసం ఆ మహిళ ఈ ప్లాన్ వేసింది!
ఇదీ జరిగింది..
ఉత్తర్ ప్రదశ్ మహారాజ్‌గంజ్‌లోని లక్ష్మీపూర్‌లో ఈ ఘటన జరిగింది. ఇటీవలే.. 38మంది జంటలు సామూహిక వివాహ మహోత్సవంలో పాల్గొని పెళ్లిచేసుకున్నారు. వీరిలో.. ఒకరు ఈ మహిళ, ఆమె సోదరుడు. కాగా.. ఆమె అప్పటికే వేరే వ్యక్తితో పెళ్లి జరిగిపోయింది.
పలు మీడియా కథనాల ప్రకారం.. మధ్యవర్తులు.. ఆ మహిళ, ఆమె సోదరుడికి నచ్చజెప్పి, పెళ్లి పీటలప కూర్చోబెట్టారు. పెళ్లి రోజున.. వారిద్దరు వరమాలలు వేసుకున్నారు, అగ్ని హోమం చుట్టు 7 అడుగులు వేశారు. ఇలా.. సాధారణ పెళ్లిలో జరిగేవన్నీ చేశారు ఆ మహిళ, ఆమె సోదరుడు. ఆ తర్వాత.. అధికారుల నుంచి వారిద్దరికి బహుమతులు కూడా అందాయి.
ఈ విషయం ఎలా బయటకి వచ్చిందో కానీ.. అధికారుల దృష్టికి వెళ్లింది. వివాహిత, తన సోదరుడిని పెళ్లి చేసుకుందన్న ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇది నజమే అని తేలినట్టు సమాచారం. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. లక్ష్మీపూర్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అమిత్ మిశ్రా తెలిపారు. వారికి ఇచ్చిన బహుమతులను ఇప్పటికే వెనక్కి తీసుకున్నట్టు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ యోజన అంటే ఏంటి?
Mukhyamantri Samoohik Vivah Yojna : ఆర్థికంగా వెనకపడిన వర్గాల కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిందే.. ఈ ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ యోజన్. ఈ పథకం కింద.. లబ్ధిదారుల పెళ్లిళ్లలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. సంబంధిత మహిళ మతం, విశ్వాసం, ఆచారాలకు కట్టుబడి ఏర్పాట్లు చేస్తుంది.
ఇక స్కీమ్‌లో భాగంగా.. ప్రతి జంటపై ప్రభుత్వం రూ. 51వేలు ఖర్చుపెడుతుంది. వధువుకు రూ. 35వేలు అందాయి. మిగిలినవి.. పెళ్లి ఏర్పాటు ఖర్చుల్లోకి వెళతాయి.
వాస్తవానికి ఈ పథకం చాలా గొప్పదే! కానీ ఇటీవలి కాలంలో జరుగుతున్న మోసాలతో.. ఈ స్కీమ్ వార్తలకెక్కుతోంది. అడుగడుగునా లోపాలు కనిపిస్తున్నాయి. డబ్బుకు ఆశపడి.. చాలా మంది అధికారులే తప్పులు చేస్తున్నారు.
Mukhyamantri Samoohik Vivah Yojna viral video : ఇటీవలే ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. బాలియ ప్రాంతంలో.. వధువులు వారికి వారే వరలమాలలు వేసేసుకుని పెళ్లి తంతు ముగించారు. కొందరైతే.. మహిళల వేషాలు వేసుకుని మరీ పెళ్లి చేసుకున్నారు!
ఉత్తర్ ప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో జనవరి 25న జరిగింది ఈ ఘటన. ఆ ఈవెంట్లో 568 జంటలు పెళ్లి చేసుకున్నట్టు తొలుత అధికారులు చెప్పారు. కానీ.. అదొక స్కామ్ అని తర్వాత తెలిసింది. వధూవరులుగా నటించేందుకు.. ప్రజలకు డబ్బులిచ్చి మరీ అక్కడికి తీసుకెళ్లారట! రూ. 500 నుంచి రూ. 2వేల వరకు చేతికి ఇచ్చారని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం