Manipur security : మణిపూర్​లో హై అలర్ట్​- మయన్మార్​ నుంచి 900 మంది మిలిటెంట్ల ఎంట్రీ!-manipur on security alert after 900 kuki militants infilter from myanmar ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Manipur Security : మణిపూర్​లో హై అలర్ట్​- మయన్మార్​ నుంచి 900 మంది మిలిటెంట్ల ఎంట్రీ!

Manipur security : మణిపూర్​లో హై అలర్ట్​- మయన్మార్​ నుంచి 900 మంది మిలిటెంట్ల ఎంట్రీ!

Sharath Chitturi HT Telugu
Sep 21, 2024 10:15 AM IST

మయన్మార్ నుంచి 900 మందికి పైగా కుకీ మిలిటెంట్లు చొరబడి మైతీ గ్రామాలపై దాడి చేసే అవకాశం ఉందన్న సమాచారంతో మణిపూర్​లో హై అలర్ట్​ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

మణిపూర్​లో హై అలర్ట్​!
మణిపూర్​లో హై అలర్ట్​! (ANI)

హింసాత్మక ఘటనలతో ఏడాదిన్నర కాలంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న మణిపూర్​ నుంచి మరో ఆందోళనకర వార్త వెలుగులోకి వచ్చింది. మయన్మార్ నుంచి 900 మందికి పైగా కుకీ మిలిటెంట్లు రాష్ట్రంలోకి చొరబడ్డారని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి. ఫలితంగా మణిపూర్​లో భారీ భద్రతా హెచ్చరికలు జారీ అయ్యాయి.

గ్రూపులుగా విడిపోయి..!

మయన్మార్​ నుంచి చొరబడిన కుకీ మిలిటెంట్లు ప్రస్తుతం 30 మంది సభ్యులతో కూడిన యూనిట్లుగా విడిపోయి ప్రస్తుతం మణిపూర్​లో చెల్లాచెదురుగా తిరుగుతున్నట్టు తెలుస్తోంది. 2024 సెప్టెంబర్ 28 నాటికి మైతీ గ్రామాలపై పలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికను ఉటంకిస్తూ ఓ ప్రముఖ జాతీయ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. డ్రోన్ ఆధారిత బాంబులు, క్షిపణులు, జంగిల్ వార్ ఫేర్ వాడకంలో ఈ మిలిటెంట్లకు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.

ఇంటెలిజెన్స్ నివేదికను తేలిగ్గా తీసుకోలేమని మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ అన్నారు. రిపోర్ట్​లో ఉన్నట్టు క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపించనంత వరకు దాన్ని నూటికి నూరు శాతం కరెక్ట్ అని తాము నమ్ముతున్నామని ఆయన అన్నారు.

ఇదీ చూడండి:- Crime news : సెక్స్​ వర్కర్​ని చంపి.. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన కిరాతకుడు!

రాష్ట్రంలో డ్రోన్ వినియోగానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ)ను భద్రతా సంస్థలు అమలు చేయలేదని కుల్దీప్ సింగ్ తెలిపారు. అధికారుల అనుమతి లేకుండా ఈ పరికరాలను ఉపయోగించడాన్ని ఎస్ఓపీ నిషేధిస్తుంది. దక్షిణ మణిపూర్​లోని భారత్ -మయన్మార్ సరిహద్దుల్లోని జిల్లాల్లోని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్లందరికీ గురువారం ఇంటెలిజెన్స్ నివేదిక అందింది.

మయన్మార్​లోని చిన్ స్టేట్​తో పాటు ఇతర రాష్ట్రాల్లోని సాయుధ గ్రూపుల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మయన్మార్​తో భారత్ సరిహద్దును పంచుకుంటున్నందున, సరిహద్దుకు సమీపంలో కొన్ని హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. దీనికితోడు చిన్ స్టేట్ తిరుగుబాటుదారులు తమను ఆక్రమించుకున్న తర్వాత కొన్ని జుంటా దళాలు భారత్​లోకి చొరబడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

కోటాలు, ఆర్థిక ప్రయోజనాల కోసం మైతీలు, కుకీ వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్​ని ఏడాది కాలంగా కుదిపేస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం మరింత ఆందోళనకర విషయం. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో అక్రమ వలసదారుల చొరబాట్లు పెద్ద ఎత్తున సాధ్యమయ్యాయి.

మరోవైపు భారత సైన్యం, మణిపూర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్​లో, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని కొండ ప్రాంతాలలో పెద్ద మొత్తంలో ఇంప్రొవైజ్డ్ ఎక్స్​ప్లోజివ్​ డివైజెస్ (ఐఈడీ)ని ఇటీవలే అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం