దాంపత్యంలో భార్యభర్తల మధ్య చిన్న పాటి ఘర్షణలు సహజం. మీ బంధం మరింత బలపడేందుకు చిన్న చిన్న గొడవలు సహాయపడతాయంటున్నాయి అధ్యయనాలు. ఆరోగ్యకరమైన ఘర్షణ ఎందుకు అవసరమో తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Jul 17, 2024
Hindustan Times Telugu
చిన్న పాటి ఘర్షణ మరొక వ్యక్తితో విభేదాలు, అసమ్మతి లేదా సమస్యను నేరుగా పరిష్కరించే చర్య. ఒకరి భావాలు, ఆలోచనలను లేదా బహిరంగంగా, నిజాయితీగా వ్యక్తీకరించడం. ఇది కమ్యూనికేషన్‌లో ఒక ముఖ్యమైన అంశం.
pexels
అపార్థాలను క్లియర్ అవ్వడానికి- హెల్తీ రిలేషన్ కు చిన్నపాటి గొడవలు, అలకలు చాలా అవసరం. ఇవి ఇద్దరి మధ్య లోతైన అవగాహనను, సంబంధాన్ని పెంపొందిస్తుంది. సమస్యలను నేరుగా పరిష్కరించడానికి సహాయపడుతుంది.
pexels
మెరుగైన కమ్యూనికేషన్ - ఇరువురు తమ ఆలోచనలు, భావాలను బహిరంగంగా వ్యక్తీకరించడం, ఒకరి వాదన మరొకరు వినడం దాంపత్యంలో కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుంది. వ్యక్తి భావాలు అర్థం చేసుకునేందుకు ఘర్షణ సహాయపడుతుంది.
pexels
వ్యక్తిగత వృద్ధి - నిర్మాణాత్మక ఘర్షణ పర్సనల్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే వ్యక్తులు వారి సొంత ప్రవర్తన గురించి మరింత అవగాహన పెంచుకుంటారు.
pexels
స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది- దాంపత్యంలో చిన్న చిన్న సమస్యలను తొందరగా పరిష్కరించడానికి ఘర్షణలు ఉపయోగపడతాయి. దీంతో విభేదాలు పెద్దవి అవ్వకుండా నిరోధించవచ్చు. దీంతో స్థిరమైన, సామరస్యమైన సంబంధాలను కొనసాగించవచ్చు. ఇద్దరు భాగస్వాముల మధ్య బంధం మరింత బలపడుతుంది.
pexels
మీ వాదనలకు ప్రైవేట్ సెట్టింగ్‌ను ఎంచుకోండి. బయట వారి ప్రమేయం లేకుండా మీరిద్దరూ చర్చపై దృష్టి పెట్టండి.
pexels
మీ భాగస్వామితో ఘర్షణ పడుతున్నప్పుడు 'నేను' స్టేట్మెంట్ ఉపయోగిస్తూ మీ ఆందోళనలను తెలియజేయండి. ఎదుటివారిపై నిందలు మోపకుండా మీ భావాలను వ్యక్తపరచండి.