Wife kills husband : ప్రియుడి గురించి తెలిసిపోయిందని.. భర్తను చంపేసిన భార్య!-man murdered by wife partner in up bijnor ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Wife Kills Husband : ప్రియుడి గురించి తెలిసిపోయిందని.. భర్తను చంపేసిన భార్య!

Wife kills husband : ప్రియుడి గురించి తెలిసిపోయిందని.. భర్తను చంపేసిన భార్య!

Sharath Chitturi HT Telugu
Nov 05, 2023 11:05 AM IST

Wife kills husband : ప్రియుడి వ్యవహారం తెలిసిపోయిందన్న కారణంతో.. ఓ మహిళ, తన భర్తను చంపేసింది. ఇందుకోసం ప్రియుడి సాయం తీసుకుంది. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో జరిగింది.

ప్రియుడి గురించి తెలిసిపోయిందని.. భర్తను చంపేసిన భార్య!
ప్రియుడి గురించి తెలిసిపోయిందని.. భర్తను చంపేసిన భార్య!

Wife kills husband : ఉత్తర్​ ప్రదేశ్​లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి వ్యవహారం తెలిసిపోయిందన్న కారణంతో.. అతడితో కలిసి భర్తను చంపేసింది ఓ మహిళ!

ఇదీ జరిగింది..

ఉత్తర్​ ప్రదేశ్​లోని బిజ్​నోర్​ జరిగింది ఈ ఘటన. రాజేశ్​ కశ్యప్​ అనే  40ఏళ్ల వ్యక్తి.. తన భార్య రీటాతో కలిసి జీవిస్తున్నాడు. కాగా.. రీటాకు ఫైమ్​ అనే వ్యక్తితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం.. ఇటీవలే రాజేశ్​ కశ్యప్​కు తెలిసిపోయింది. ఫైమ్​.. తన ఇంటికి రాకూడదని తేల్చిచెప్పాడు రాజేశ్​.

రాజేశ్​పై కోపం పెంచుకున్న ఫైమ్​, రీటాలు.. అతడిని చంపేద్దామని ఫిక్స్​ అయ్యారు. ఈ క్రమంలో.. ఫైమ్​ తన స్నేహితుడు సురేశ్​ సాయం తీసుకున్నాడు. ముగ్గురు కలిసి రాజేశ్​ కశ్యప్​ని చంపేందుకు ప్లాన్​ వేశారు.

Wife kills husband in Uttar Pradesh : శుక్రవారం నాడు.. సురేశ్​తో కలిసి రాజేశ్​ని కలిశాడు ఫైమ్​. ఆ సమయంలో రీటా కూడా అక్కడే ఉంది. మాట్లాడాలంటూ.. రాజేశ్​ కశ్యప్​ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు ఆ ముగ్గురు. అక్కడే అతడిని చంపేశారు. గొంతును స్కార్ఫ్​ కట్టి.. ఊపిరాడనివ్వకుండా చేసి హత్య చేశారు. అనంతరం.. జోధువాలా గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులో పడేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇదీ చూడండి:- Crime news : మహిళపై ఐదుగురు సెక్యూరిటీ గార్డుల గ్యాంగ్​ రేప్​.. ఇల్లు దోచుకుని!

మరుసటి రోజు.. ఆ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో ఆ మృతదేహం ఎవరిది? ఆ వ్యక్తి ఎలా మరణించాడు? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే.. రాజేశ్​ కశ్యప్​ వివరాలు తెలుసుకున్నారు పోలీసులు. చివరికి.. ఫైమ్​ దొరికిపోయాడు. ఆ తర్వాత రీటా, సురేశ్​ల విషయం కూడా పోలీసులకు తెలిసింది.

"రీటాతో నేను రిలేషన్​లో ఉన్నాను. ఆ విషయం రాజేశ్​కి తెలిసిపోయింది. నన్ను వాళ్ల ఇంట్లోకి రానివ్వలేదు. అందుకే, చంపేద్దామని నిర్ణయించుకున్నాము," అని ఫైమ్​ పోలీసులకు చెప్పాడు. విచారణ అనంతరం.. ఫైమ్​తో పాటు సురేశ్​ని పోలీసులు అరెస్ట్​ చేశారు.

Uttar Pradesh crime news : రాజేశ్​ కశ్యప్​ని చంపేందుకు ఉపయోగించిన స్కార్ఫ్​, అతడి మొబైల్​ ఫోన్​ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు.. ప్రియుడి కోసం భర్తను చంపిన రీటా అనే మహిళ.. పరారీలో ఉందని తెలుస్తోంది. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని సమాచారం. ఈ పూర్తి వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.

సంబంధిత కథనం