Crime news : మహిళపై ఐదుగురు సెక్యూరిటీ గార్డుల గ్యాంగ్​ రేప్​.. ఇల్లు దోచుకుని!-gujarat five security guards held for gang raping woman looting flat in ahmedabad ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gujarat: Five Security Guards Held For Gang-raping Woman, Looting Flat In Ahmedabad

Crime news : మహిళపై ఐదుగురు సెక్యూరిటీ గార్డుల గ్యాంగ్​ రేప్​.. ఇల్లు దోచుకుని!

Sharath Chitturi HT Telugu
Nov 04, 2023 08:50 AM IST

Gujarat crime news : సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న ఐదుగురు.. ఓ పనిమనిషిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె పనిచేస్తున్న ఇంటిని దోచుకుని పారిపోయారు. గుజరాత్​లో జరిగింది ఈ ఘటన.

మహిళపై ఐదుగురు సెక్యూరిటీ గార్డుల గ్యాంగ్​ రేప్​..
మహిళపై ఐదుగురు సెక్యూరిటీ గార్డుల గ్యాంగ్​ రేప్​..

Gujarat crime news : గుజరాత్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో.. పనిమనిషిగా పనిచేస్తున్న ఓ 20ఏళ్ల మహిళపై ఐదుగురు సెక్యూరిటీ గార్డులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ ఇంటిని దోచుకుని పారిపోయారు.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

గుజరాత్​లోని అహ్మదాబాద్​కు చెందిన బోపోల్​ అనే ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది ఈ ఘటన. ఈ ప్రాంతంలో కొత్తగా కట్టిన ఓ భవనం ఉంది. అందులో కొన్ని ఫ్లాట్లే అమ్ముడుపోయాయి. కాగా.. ఒక ఫ్లాట్​లో.. ఓ 40ఏళ్ల మహిళ నివాసముంటోంది. ఆమెకు సాయం చేసేందుకు ఓ 20ఏళ్ల మహిళ పనిమనిషిగా చేరింది.

స్థానికంగా సెక్యూరిటీగార్డులుగా పనిచేస్తున్న ఐదుగురికి.. ఆ ఇంటిపై కన్నుపడింది. దీపావళి కోసం ఇంటికి వెళ్లే ముందు, ఆ ఇంటిని దోచుకోవాలని ప్లాన్​ చేశారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి.. ఈ ఫ్లాట్​ పవర్​ సప్లై ని కట్​ చేసి, ఆన్​ చేయడం మొదలుపెట్టారు. అసలేం జరుగుతోందని తెలుసుకునేందుకు.. ఆ 20ఏళ్ల పని మనిషి ఫ్లాట్​ బయటకు వచ్చింది. అప్పుడు సమయం శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలు! అదే అవకాశంగా భావించిన సెక్యూరిటీ గార్డులు.. ఆ పనిమనిషిని లోపలికి ఈడ్చూకుని వెళ్లి, ఆమెపై గ్యాంగ్​ రేప్​నకు పాల్పడ్డారు. అనంతరం ఫ్లాట్​లో ఉన్న రూ. 14వేల నగదు, ల్యాప్​టాప్​, ఓ ఏటీఎం కార్డును దొంగిలించి, అక్కడి నుంచి పారిపోయారు. ఓ ఏటీఎం సెంటర్​కు వెళ్లి, ఆ కార్డుతో రూ. 40వేల విత్​డ్రా చేసి, రాజస్థాన్​కు పారిపోయేందుకు ప్రయత్నించారు.

Gujarat gang rape news : ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు.. వెంటనే స్పందించారు. ఘటనాస్థలానికి వెళ్లి, జరిగినది తెలుసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఆ ఐదుగురిని ట్రేస్​ చేశారు. వారు బస్సులో రాజస్థాన్​కు పారిపోతున్నారని తెలుసుకున్నారు. ఈ క్రమంలో.. బనస్కంత జిల్లాలోని రాజస్థాన్​ సరిహద్దు ప్రాంతంలో సెక్యూరిట గార్డులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

"ఐుదుగురిలో ఒకరు ముగ్గురు పంజాబ్​కి చెందినవారు. ఇద్దరు యూపీవాసులు. ఒక వ్యక్తి మధ్యప్రదేశ్​వాసి. నేరానికి పాల్పడిన వేళ ఒకరు కాపాల కాచారు. ముగ్గురు లోపలికి వెళ్లారు. ఐదో వ్యక్తి ఏం చేశాడు? అన్నది విచారణలో తెలుస్తుంది," అని పోలీసులు తెలిపారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం