Maharashtra crime news : బైక్‌కి డాష్ ఇచ్చాడని.. యువకుడిని కొట్టి చంపేశారు!
Maharashtra crime news : మహారాష్ట్రలో ఓ యువకుడిని, ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపేశారు! తమ బైక్ మిర్రర్‌కు అతని బైక్ డాష్ ఇచ్చిందన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.
Maharashtra crime news : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బైక్‌కి డాష్ ఇచ్చాడన్న కారణంతో.. ఓ 20ఏళ్ల యువకుడిని, ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపేశారు!
ఇదీ జరిగింది..
మహారాష్ట్ర పాల్గఢ్లోని నల్లాసొపర ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన జరిగింది. బాధితుడు రోహిత్ యాదవ్, తన ఫ్రెండ్‌తో కలిసి బైక్ మీద బయటకు వెళ్లాడు. కాగా.. ఆ ప్రాంతంలోని ఫ్లైఓవర్ మీదకు వెళ్లేసరికి, అక్కడే ఉన్న మరో బైక్ మిర్రర్‌కు రోహిత్ యాదవ్ వాహనం తగిలింది! అంతే.. ఆ బైక్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులు, రోహిత్ యాదవ్, అతని స్నేహితుడితో గొడవపడటం మొదలుపెట్టారు.
వారి మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. మాటామాటా పెరగడంతో ఆ ముగ్గురికి కోపం తీవ్రస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే రోహిత్ యాదవ్, అతని స్నేహితుడిపై దాడి చేశారు. రక్తం వచ్చేలా కొట్టారు. ఈ దాడిలో రోహిత్ యాదవ్ మరణించాడు. తీవ్ర గాయాలపాలైన అతని స్నేహితుడు.. ఆసుపత్రిలో చేరాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఆధారాలను సేకరించారు. స్థానికులతో మాట్లాడారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ముగ్గురు నిందితులు నల్లాసొపర ప్రాంతానికి చెందినవారేనని తెలుుసకున్నారు. ఘటన జరిగిన 8 గంటల్లోనే ముగ్గురుని అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు సాగుతున్నట్టు వివరించారు.
ఇదీ చూడండి:- Murder Attempt: వివాహితతో సంబంధం, అనుమానంతో హత్యాయత్నం..
భార్యను చంపిన భర్త..
Man kills wife : దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో ఏం చేస్తున్నామో కూడా తెలుసుకోకుండా.. పలువురు నేరాలకు పాల్పడుతున్నారు. భార్యతో గొడవ పడిన ఓ వ్యక్తి.. ఆమెను చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో ఉన్న ధన్ధని గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో నివాసముండే పవన్ బిన్జ్వార్ (37), అతని భార్య సుమ్తి బిన్జ్వార్ (35)లు.. సోమవారం ఉదయం బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రికి తిరిగి ఇంటికి వచ్చేశారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కాని.. ఇంటికి వచ్చిన తర్వాత వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. కోపంతో ఊగిపోయిన పవన్.. గొడ్డలితో తన భార్యను నరికి చంపేశాడు. అనంతరం తన ఇంటి సీలింగ్‌కు లుంగీ వేలాడదీసి, ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసినట్టు వెల్లడించారు.
సంబంధిత కథనం