Free travel scheme: వారందరికి.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత పర్యటనలు- ప్రభుత్వం ప్రకటన
Free travel scheme : 75ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత పర్యటన స్కీమ్‌ను ప్రవేశపెట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలు..
Free travel scheme : 75ఏళ్లు పైబడిన వృద్ధులకు.. ఉచిత పర్యటన వెసులుబాటును ప్రారంభించింది ఎమ్ఎస్ఆర్టీసీ(మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్). ప్రభుత్వ ఆధారిత బస్సుల్లో ఇకపై 75ఏళ్లు పైబడిన వృద్ధులు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది.
ఈ ఫ్రీ ట్రావెల్ స్కీమ్‌లో భాగంగా.. ఆగస్టు 26కి ముందు ఎవరైనా టికెట్లు బుక్ చేసుకుని ఉంటే.. వారందరికి డబ్బులు రీఫండ్ కూడా చేస్తామని మహారాష్ట్ర ఆర్టీసీ వెల్లడించింది.
బస్సులో వృద్ధుల ఉచిత ప్రయాణాలకు సంబంధించి.. కొన్ని రోజుల క్రితమే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే.. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో షిండే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Maharashtra Free travel scheme : ప్రభుత్వ ఆధారిత బస్సులో ఈ ఉచిత పర్యటనను పొందాలనుకునే వారు.. ఆధార్ వంటి గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. అప్పుడే వారికి ఉచిత పర్యటన స్కీమ్ వర్తిస్తుంది.
రాష్ట్రంలో చేపట్టే పర్యటనలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. దీనికి మంచి ప్రత్యేక వెసులుబాటులు ఏమీ లేవు.
ఎంపిక చేసిన ఎమ్ఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే 65-75 మధ్య వయస్కులకు.. టికెట్ ధరలో 50శాతం రిబేట్ లభిస్తుంది.
ఎమ్ఎస్ఆర్టీసీకి ప్రస్తుతం 16000 బస్సులు ఉన్నాయి. కొవిడ్ సంక్షోభానికి ముందు.. రోజుకు 65వేల మంది ఆయా బస్సుల్లో ప్రయాణించేవారు.
MSRTC : ఇక మళ్లీ ఆర్టీసీలోకి ప్రజలకు ఆహ్వానించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఉచిత పర్యటన స్కీమ్ చేపట్టింది. మరోవైపు.. ముంబై- పుణె మధ్య 100కుపైగా ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల సేవలను సైతం ప్రారంభించింది. వీటికి ఆదరణ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
సంబంధిత కథనం