Lok Sabha polls 2024 : మోదీ గెలవాలని చూపుడు వేలు కోసుకుని.. కాళీ మాతకు ప్రార్థనలు!
Lok Sabha elections 2024: 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచి ప్రధాని మోదీ హ్యాట్రిక్ కొట్టాలని.. ఓ కర్ణాటక వాసి.. తన చూపుడు వేలును కోసుకున్నాడు. అనంతరం కాళీ మాతకు ప్రార్థనలు చేశాడు.
Man sacrifices finger for PM Modi's victory : ఇండియాలో 2024 లోక్సభ ఎన్నికల హడావుడి తారస్థాయిలో ఉంది. ర్యాలీలు, బహిరంగ సభలతో అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు బిజీబిజీగా గడుపుతున్నారు. వీటన్నింటి మధ్య.. కర్ణాటకలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వార్తలకెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎన్నికల్లో గెలవాలని ప్రార్థిస్తూ, ఓ వ్యక్తి.. తన చూపుడు వేలును కోసుకున్నాడు!
మోదీ గెలవాలని చూపుడు వేలు కోసుకున్న వ్యక్తి..
పలు మీడియా కథనాల ప్రకారం.. కర్ణాటకలో నివాసముండే అరుణ్ వర్నేకర్కు మోదీ అంటే చాలా అభిమానం. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో మోదీ గెలవాలని.. తన చూపుడు వేలును కోసుకున్నాడు అరుణ్. మోదీ కోసం తన చూపుడు వేలును కాళీ మాతకు బలిదానంగా ఇచ్చాడు!
“వర్నేకర్.. తన చూపుడు వేలును కోసుకున్నాడు. ఆ తర్వాత.. రక్తంతో నిండిన చెయ్యితో.. “అమ్మా ఖాళీ మాతా.. మోదీ బాబా అందరి కన్నా గొప్పవారు. ఆయన్ని నువ్వే రక్షించాలి. మోదీని గెలిపించాలి,”” అని రాశాడట!
Lok Sabha election BJP : మోదీ అంటే వర్నేకర్కి పిచ్చి ప్రేమ! ఇప్పటికే.. ఆయన ఇంట్లో మోదీకి ఓ గుడి కూడా కట్టాడు. అందులో మోదీకి నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు!
ఈ మధ్య కాలంలో.. మోదీపై అభిమానాన్ని చాలా మంది చిత్ర విచిత్రంగా ప్రకటిస్తున్నారు! అరుణ్ వర్నేకర్ తన చూపుడు వేలు కోసుకున్నాడు. కాగా.. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి.. తన కూతురు పెళ్లి సందర్భంగా పంచిన వెడ్డింగ్ కార్డుతో మోదీపై అభిమానాన్ని చాటుకున్నారు. “మాకు గిఫ్ట్లు వద్దు.. మోదీకి ఓటు వేయండి” అంటూ ప్రచారం చేశాడు.
మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారా..?
PM Modi lok sabha elections : ఇండియాలో జరుగుతున్న ఎన్నికల సర్వేలు చూస్తుంటే.. అరుణ్ వర్నేకర్ చూపుడు వేలు త్యాగం ఫలించేడట్టే ఉంది! ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన దాదాపు అన్ని సర్వేలు.. 2024 లోక్సభ ఎన్నికల్లో మోదీ విక్టరీ ఖాయమనే చెబుతున్నాయి. ఇదే నిజమైతే.. జవహర్లాల్ నెహ్రూ తర్వాత.. భారత దేశానికి వరుసగా మూడుసార్లు ప్రధాని బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు మోదీ.
మోదీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ కూడా శ్రమిస్తోంది. మోదీ మేనియాను ప్రజల్లోకి తీసుకెళ్లి.. ఓటర్లను తమవైపు తిప్పుకుంటోంది.
మరి ఎన్నికల సర్వేలు చెబుతున్నవి నిజం అవుతాయా? మోదీ హ్యాట్రిక్ కొడతారా? లేక విపక్ష ఇండియా కూటమి షాక్ ఇస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే.. ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే!
సంబంధిత కథనం