Loan recovery agent kills woman : గర్భవతిని ట్రాక్టర్‌తో తొక్కించిన లోన్ రికవరీ ఏజెంట్!
Loan recovery agent kills pregnant woman : వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ దివ్యాంగుడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. లోన్ రికవరీ ఏజెంట్ చేసిన పనితో.. ఆ దివ్యాంగుడి కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. మూడు నెలల గర్భవతిపై ట్రాక్టర్ తొక్కించి చంపేశాడు ఆ లోన్ రికవరీ ఏజెంట్. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది.
Loan recovery agent kills pregnant woman : ఝార్ఖండ్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 3 నెలల గర్భవతిపైకి ట్రాక్టర్ ఎక్కించి చంపేశాడు ఓ లోన్ రికవరీ ఏజెంట్.
ఇంత దారుణమా..
పోలీసుల సమాచారం ప్రకారం.. హజారిబాఘ్లోని ఇచక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది ఈ ఘటన. ఆ ప్రాంతంలో ఓ దివ్యాంగుడు పొలం పనులు చేసుకుంటూ జీవితన్ని గడుపుతున్నాడు. ఆయనకు ఓ కుమార్తె ఉంది. ఆమె మూడు నెలల గర్భవతి.
కాగా.. మహీంద్రా ఫైనాన్స్ నుంచి లోన్ రికవరీ ఏజెంట్.. గురువారం ఆ దివ్యాంగుడి ఇంటికి వెళ్లాడు. వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకునేందుకు లోన్ రికవరీ ఏజెంట్ ప్రయత్నించాడు. ట్రాక్టర్‌కు ఆ గర్భవతి అడ్డంగా నిలబడింది. ఫలితంగా.. చక్రాల కింద పడి, ఆ గర్భవతి ప్రాణాలు కోల్పోయింది.
Pregnant woman killed by loan recovery agent : ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు.
బాధితుల ఇంటికి వెళ్లే ముందు.. లోన్ రికవరీ అధికారులు తమకు ఎలాంటి సమాచారం అందించలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంపై మహీంద్రా గ్రూప్ మేనేజింగ్ డైరక్టర్, సీఈఓ అనీశ్ షా స్పందించారు. ఘటనపై తాము కూడా దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు.
"హజారిబాఘ్లో జరిగిన ఘటన అత్యంత బాధాకరం. ప్రస్తుతం ఉన్న థర్డ్ పార్టీ కలక్షన్ ఏజెంట్ల వ్యవస్థను మేము మళ్లీ సమీక్షిస్తాము," అని షా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు.
సంబంధిత కథనం