Uttarakhand UCC Bill 2024 : సహజీవనం చేస్తే డిక్లరేషన్ ఇవ్వాలి, లేదంటే జైలుశిక్ష! ఉత్తరాఖండ్ UCC బిల్లులో కీలక అంశాలు-livein couples in uttarakhand must register or face imprisonment according uttarakhand ucc bill 2024 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Uttarakhand Ucc Bill 2024 : సహజీవనం చేస్తే డిక్లరేషన్ ఇవ్వాలి, లేదంటే జైలుశిక్ష! ఉత్తరాఖండ్ Ucc బిల్లులో కీలక అంశాలు

Uttarakhand UCC Bill 2024 : సహజీవనం చేస్తే డిక్లరేషన్ ఇవ్వాలి, లేదంటే జైలుశిక్ష! ఉత్తరాఖండ్ UCC బిల్లులో కీలక అంశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 07, 2024 12:11 PM IST

Uttarakhand UCC Bill 2024 : ఉత్తరాఖండ్‌ సర్కార్ మంగళవారం యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు -2024 ను అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చింది. ఈ బిల్లు ప్రకారం.. సహజీవనం చేస్తున్నవారు జిల్లా రిజిస్ట్రార్‌కు డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే జైలు శిక్ష లేదా జరిమానా ఉంటాయని తెలిపింది.

ఉత్తరాఖండ్‌లోని ధామి ప్రభుత్వం అసెంబ్లీలో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టింది.
ఉత్తరాఖండ్‌లోని ధామి ప్రభుత్వం అసెంబ్లీలో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టింది. (PTI)

Uttarakhand's Uniform Civil Code Bill 2024 Updates: ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌(Uniform Civil Code Bill) బిల్లును మంగళవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. స్వతంత్ర భారత దేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా రికార్డులోకెక్కింది. ఉత్తరాఖండ్‌లోని పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. ఈ బిల్లును చట్టంగా మార్చే పనిలో పడింది. ఈ బిల్లులో పలు కీలకమైన అంశాలను పొందుపర్చిచారు. ఈ బిల్లును ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

డిక్లరేషన్ ఇవ్వాల్సిందే….!

సహజీవనం చేసేవారు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఈ బిల్లులో పేర్కొన్నారు. జిల్లా రిజిస్ట్రార్ వద్ద వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని… ఇలా చేయకపోతే జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారని ప్రస్తావించారు. బిల్లు చట్టంగా మారితే… ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు బిల్లులో తెలిపారు. ఇటువంటి సంబంధాల ద్వారా జన్మించిన పిల్లలు చట్టబద్ధంగా పరిగణించబడతారని వివరించారు.

ఈ బిల్లు(Uttarakhand's Uniform Civil Code Bill 2024) ప్రకారం…. వివాహాల మాదిరిగానే.. లివ్-ఇన్ రిలేషన్ షిప్‌లు కూడా తప్పనిసరిగా నమోదు చేయబడాలి. రిలేషన్ షిప్ లో ఉండే భాగస్వాములు 18 ఏళ్లలోపు ఉండకూడదు. కానీ వీరిలో ఎవరైనా 21 ఏళ్లలోపు ఉన్నట్లయితే… రిజిస్ట్రార్ వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు తెలియజేయాలి.

మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం…. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రతి భాగస్వామి తమ రిలేషన్‌షిప్‌పై రిజిస్ట్రార్‌కు స్టేట్‌మెంట్‌ను సమర్పించడం తప్పనిసరి. లేదా జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరైనా లివ్ ఇన్ రిలేషన్ షిప్ నమోదు చేసుకోకుండా ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు ఉంటే వారికి మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 10,000 వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని బిల్లు పేర్కొంది.

తప్పుడు సమాచారం ఇస్త్తే..

రిజిస్ట్రార్‌కు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై తన స్టేట్‌మెంట్‌లో తప్పుడు సమాచారం అందించిన ఏ వ్యక్తికైనా మూడు నెలల వరకు జైలు శిక్షతో పాటు రూ. 25,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ బిల్లు ప్రకారం…. కనీసం ఒక భాగస్వామి మైనర్ గా ఉన్నా వివరాలను నమోదు చేయరు. భాగస్వాముల్లో ఎవరైనా 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే…. బిల్లు ప్రకారం రిజిస్ట్రార్ వారి తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు తెలియజేస్తారు. ఉత్తరాఖండ్ వాసులకు రాష్ట్రం వెలుపల లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న వారికి కూడా వర్తిస్తుంది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో విడిపోయిన మహిళ కోర్టును ఆశ్రయించవచ్చు మరియు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి అర్హులు. ఈ బిల్లు ఆమోదానికి సంబంధించి ఇవాళ(బుధవారం) చర్చ జరగనుంది.

షెడ్యూల్డ్ తెగలను మినహాయించి ఉత్తరాఖండ్‌లో మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ వివాహం, విడాకులు, భూమి, ఆస్తి మరియు వారసత్వంపై ఉమ్మడి చట్టాన్ని ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది.అయితే దీనిపై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలన్నీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఉత్తరఖాండ్ సర్కార్ చట్టం చేసే దిశగా అడుగులు వేస్తున్న ఉమ్మడి పౌరస్మృతిపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఉమ్మడి పౌరస్మృతి బిల్లు అమలు అయితే దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది.

Whats_app_banner

టాపిక్