Live News Today: ప్రకాశ్ సింగ్ బాదల్‍కు తుది నివాళులు అర్పించిన ప్రధాని మోదీ-live updates breaking news today april 26 2023 latest news ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Live News Today: ప్రకాశ్ సింగ్ బాదల్‍కు తుది నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

Live News Today: ప్రకాశ్ సింగ్ బాదల్‍కు తుది నివాళులు అర్పించిన ప్రధాని మోదీ(HT_PRINT)

Live News Today: ప్రకాశ్ సింగ్ బాదల్‍కు తుది నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

11:56 PM ISTApr 26, 2023 10:25 PM HT Telugu Desk
  • Share on Facebook
11:56 PM IST

  • నేటి జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ లైవ్ పేజీ ఫాలో కండి. తాజా వార్తలు తెలుసుకోండి. 

Wed, 26 Apr 202304:55 PM IST

Rail Vikas Nigam: ‘రైల్ వికాస్ నిగమ్’ ఇక ‘మినిరత్న’ కాదు.. ‘నవరత్న’ కంపెనీ

ప్రభుత్వ రంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ (Rail Vikas Nigam Limited RVNL) కు నవరత్న’ హోదా కల్పించే ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ (Finance ministry) ఆమోదం తెలిపింది. దాంతో, నవరత్న హోదా పొందిన 13వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా రైల్ వికాస్ నిగమ్ (Rail Vikas Nigam Limited RVNL) నిలిచింది.

Wed, 26 Apr 202304:20 PM IST

Ex-boyfriend murdered teen: పెళ్లికి నిరాకరించిందని గొంతు నులిమి యువతి హత్య

Ex-boyfriend murdered teen: యమునా నగర్ లో లభించిన యువతి మృతదేహం సంచలనం సృష్టించింది. పోలీసులు దర్యాప్తు జరిపి, ఆ యువతి స్నేహితుడే ఆమెను హత్య చేశాడని నిర్ధారించారు. తనను పెళ్లి చేసుకోవడానికి ఆమె నిరాకరించడంతో ఆమెను హత్య చేశాడని తెలిపారు.

Wed, 26 Apr 202303:16 PM IST

Supreme Court: కన్న కూతురిని కాటేసిన తండ్రికి క్షమాభిక్షా?- సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court news: కన్న కూతురిపైనే అత్యాచారం చేసిన తండ్రికి ఎలాంటి తగ్గింపు లేని 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష సముచితమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ తండ్రి వేసుకున్న పిటిషన్ ను కొట్టివేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యక్తి అత్యంత అమానవీయ, నీతిబాహ్యమైన, రాక్షస నేరానికి ఒడిగట్టాడని మండిపడింది.

Wed, 26 Apr 202302:30 PM IST

Tecno Phantom V Fold: టెక్నో నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్ - టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్

Tecno Phantom V Fold: స్మార్ట్ ఫోన్ మ్యానుఫాక్చరర్ టెక్నో తొలిసారి భారత్ లో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టింది. టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ (Tecno Phantom V Fold) పేరుతో ఫోల్డబుల్ ఫోన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారత్ లో లభిస్తున్న అత్యంత చవకైన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఇది.

Wed, 26 Apr 202302:08 PM IST

Liquid nano DAP: వ్యవసాయంలో విప్లవం: 50 కేజీల డీఏపీ బస్తా బదులుగా లీటర్ లిక్విడ్ నానో డీఏపీ

Liquid nano DAP: ఇఫ్కోరూపొందించిన ద్రవ రూప నానో డీఏపీ ఎరువుల రంగంలో విప్లవాత్మకమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రశంసించారు. 50 కేజీల డీఏపీ బస్తా బదులుగా ఒక లీటర్ లిక్విడ్ నానో డీఏపీని వాడొచ్చని తెలిపారు. 50 కేజీల డీఏపీ బ్యాగ్ ధరలో సగం ధరకే ఈ ద్రవ రూప లిక్విడ్ డీఏపీ లభిస్తుందన్నారు.

Wed, 26 Apr 202301:37 PM IST

Karnataka polls: కర్నాటకలో ఏప్రిల్ 28 నుంచి ప్రధాని మోదీ సుడిగాలి ప్రచారం

Karnataka polls: బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ సుడిగాలి ప్రచారం జరపనున్నారు. ఏప్రిల్ 28 నుంచి మే 7 వ తేదీ వరకు వివిధ ప్రధాన ప్రాంతాల్లో ప్రధాని మోదీ ప్రచార సభలను ఏర్పాటు చేశారు.

Wed, 26 Apr 202312:04 PM IST

RBI Grade B Notification: ఆర్బీఐ లో గ్రేడ్ బీ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

RBI Grade B Notification: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో గ్రేడ్ బీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ https://www.rbi.org.in ద్వారా మే 9వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Wed, 26 Apr 202310:55 AM IST

Rapido rider gropes woman: మహిళా ప్రయాణికురాలికి ర్యాపిడో డ్రైవర్ వేధింపులు

Rapido rider gropes woman: రాత్రి సమయంలో ర్యాపిడో (Rapido) బైక్ టాక్సీని బుక్ చేసుకున్న యువతిని ర్యాపిడో బైక్ టాక్సీ డ్రైవర్ వేధింపులకు గురి చేశాడు. బుక్ చేసుకున్న సమయంలో తెలిపిన గమ్యానికి కాకుండా, వేరే ప్రదేశానికి తీసుకెళ్తుండడంతో, భయాందోళనలకు గురైనా ఆ యువతి బైక్ పై నుంచి దూకేసింది.

Wed, 26 Apr 202310:24 AM IST

IED blast by Maoists in Chhattisgarh: చత్తీస్ గఢ్ లో మావోల ఘాతుకం

IED blast by Maoists in Chhattisgarh: చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు (Maoists) మరో ఘాతుకానికి తలబడ్డారు. రాష్ట్రంలోని మావోల ప్రాబల్యం అధికంగా ఉండే దంతెవాడ జిల్లాలో శక్తిమంతమైన ఐఈడీని పేల్చి, 10 మంది పోలీసుల ప్రాణాలు తీశారు.

Wed, 26 Apr 202309:55 AM IST

Maruti Suzuki Q4 results: 42 శాతం పెరిగిన మారుతి సుజుకీ లాభాలు

Maruti Suzuki Q4 results: భారత్ లోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థల్లో ఒకటైన మారుతి సుజుకీ (Maruti Suzuki) 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY23) ఫలితాలను ప్రకటించింది. 

మారుతి సుజుకీ (Maruti Suzuki) Q4FY23 లో రూ. 2670.08 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇది 2021 -22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సంస్థ సాధించిన నికర లాభాల కన్నా 42.34% అధికం. 2021 -22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మారుతి సుజుకీ రూ. 1875.8 కోట్ల లాభాలను ఆర్జించింది.

Wed, 26 Apr 202308:36 AM IST

Vivo X90 Series: ఇండియాలో వివో ఎక్స్90 సిరీస్ లాంచ్

Vivo X90 Series: వివో ఎక్స్90 సిరీస్ భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో విడుదలయ్యాయి. మీడియాటెక్ హీలియో 9200 5జీ ప్రాసెసర్, ప్రీమియమ్ Zeiss కెమెరాలు సహా అన్ని విభాగాల్లో ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లను ఈ మొబైళ్లు కలిగి ఉన్నాయి. వివో ఎక్స్90 ప్రారంభ ధర రూ.59,999గా ఉంది. వివో ఎక్స్90 ప్రో ధర రూ.84,999గా ఉంది. 

Wed, 26 Apr 202308:10 AM IST

కేజ్రీవాల్ ఇంటి  సుందరీకరణకు రూ.45కోట్లు: బీజేపీ ఆరోపణ

తన ఇంటి సుందరీకరణ కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రూ.45కోట్ల ప్రజాధనాన్ని వినియోగించారని బీజేపీ ఆరోపించింది. కేజ్రీవాల్ రాజులా ఫీల్ అవుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శించారు. ఈ విషయంపై కేజ్రీవాల్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Wed, 26 Apr 202307:37 AM IST

ప్రకాశ్ సింగ్ బాదల్‍కు తుది నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

Parkash Singh Badal: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‍(95)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తుది నివాళులు అర్పించారు. చండీగఢ్‍లోని శిరోమణి అకాలీదళ్ కార్యాలయంలో ఉన్న ప్రకాశ్ సింగ్ పార్థివ దేహాన్ని మోదీ నేడు సందర్శించారు. మొహాలీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాదల్ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. పంజాబ్‍కు ఐదుసార్లు సీఎంగా పని చేశారు ప్రకాశ్ సింగ్ బాదల్. ఏడు దశాబ్దాలకుపైగా రాజకీయ జీవితంలో వివిధ పదవుల్లో ప్రజలకు సేవలు అందించారు. 

Wed, 26 Apr 202306:56 AM IST

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

నేటి ఉదయం ఫ్లాట్‍గా ఓపెన్ అయిన స్టాక్ మార్కెట్ సూచీలు.. ఒడిదొడుకులతోనే సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 88 పాయింట్ల లాభంతో 60,219.69 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 18.60 పాయింట్లు పెరిగి 17,787.85 వద్ద కొనసాగుతోంది.

Wed, 26 Apr 202306:23 AM IST

ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు లాంచ్.. ధర ఇదే

MG Comet EV launch: ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్‍లో అధికారికంగా లాంచ్ అయింది. ఈ కారు ప్రారంభ ఇంట్రడక్టరీ ధర రూ.7.98లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీంతో ఇండియాలో చీపెస్ట్ ఎలక్ట్రిక్ కారుగా ఇది వచ్చింది. 230 వరకు రేంజ్‍ను ఈ స్మాల్ ఎలక్ట్రిక్ కారు ఇస్తుంది.

Wed, 26 Apr 202306:24 AM IST

వీఐటీఈఈఈ రిజల్ట్స్ వచ్చేశాయి

VITEEE Results 2023: వేలూరు ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (VITEEE) 2023 పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు viteee.vit.ac.in వెబ్‍సైట్‍లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Wed, 26 Apr 202305:29 AM IST

మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‍కు తుది నివాళి అర్పించనున్న ప్రధాని మోదీ

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‍కు నేడు తుది నివాళి అర్పించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. శ్వాసకోశ సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ (95) కన్నుమూశారు. ఆయనకు తుది నివాళి అర్పించేందుకు చండీగఢ్‍లోని శిరోమణి అకాలీదళ్ పార్టీ కార్యాలయానికి ప్రధాని మోదీ నేడు వెళ్లనున్నారు. పంజాబ్‍కు ఐదుసార్లు సీఎంగా పని చేశారు ప్రకాశ్ సింగ్ బాదల్.  పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Wed, 26 Apr 202305:23 AM IST

స్కూల్‌కు బాంబు బెదిరింపు

బుధవారం ఉదయం పాఠశాల అడ్మినిస్ట్రేషన్‌కు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీలోని మధుర రోడ్‌లో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో సోదాలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. పాఠశాలను ఖాళీ చేయించారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో అగ్నిమాపక శాఖకు బెదిరింపు సమాచారం అందింది. అగ్నిమాపక యంత్రాన్ని ఘటనా స్థలానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Wed, 26 Apr 202304:41 AM IST

వివో ఎక్స్90 సిరీస్ లాంచ్ నేడు

Vivo X90 Series India launch: వివో ఎక్స్90 సిరీస్ నేడు భారత మార్కెట్‍లో లాంచ్ కానుంది. ఈ సిరీస్‍లో వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో ఫ్లాగ్‍షిప్ 5జీ ఫోన్లు ఇండియాలో విడుదల కానున్నాయి. నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఈ లాంట్ ఈవెంట్ ఉంటుంది.

Wed, 26 Apr 202304:09 AM IST

ఫ్లాట్‍గా మొదలైన స్టాక్ మార్కెట్లు

Stock Markets Today: భారత స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్‍గా ఓపెన్ అయ్యాయి. సెషన్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 31.51 పాయింట్ల నష్టంతో 60,099.20 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 4.70 పాయింట్ల నష్టంతో 17,764.55 వద్ద సాగుతోంది. నేడు మారుతీ సుజుకీ సహా మరిన్ని కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనున్నాయి. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Wed, 26 Apr 202304:06 AM IST

Live News Today: సూడాన్ నుంచి సౌదీ అరేబియాకు చేరుకున్న భారతీయులు 

Operation Kaveri: ఘర్షణలతో కల్లోలంగా మారిన సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ కావేరి ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ముందుగా సూడాన్ నుంచి సౌదీ అరేబియాకు ఇండియన్లను భారత ప్రభుత్వం తరలిస్తోంది. సుడాన్ పోర్టు నుంచి సౌదీ అరేబియాలోని జెడాకు తీసుకొస్తోంది. ఇప్పటి వరకు మూడు బ్యాచ్‍లుగా భారతీయులు.. సూడాన్ నుంచి సౌదీ అరేబియాకు చేరుకున్నారు.