Arvind Kejriwal: కేజ్రీవాల్ ఇంటి సుందరీకరణకు రూ.45కోట్లు.. ఒక్కో కర్టన్ రూ.7.94లక్షలు: దుమారం రేపుతున్న బీజేపీ-delhi cm arvind kejriwal spent 45 crore to beautify his residence bjp alleges ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Delhi Cm Arvind Kejriwal Spent 45 Crore To Beautify His Residence Bjp Alleges

Arvind Kejriwal: కేజ్రీవాల్ ఇంటి సుందరీకరణకు రూ.45కోట్లు.. ఒక్కో కర్టన్ రూ.7.94లక్షలు: దుమారం రేపుతున్న బీజేపీ

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 26, 2023 01:32 PM IST

Arvind Kejriwal Residence: తన నివాసం సుందరీకరణకు ఢిల్లీ సీఎం రూ.45కోట్లు వాడుకున్నారని బీజేపీ విమర్శించింది. దీనికి ఆప్ బదులిచ్చింది.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా (ANI Photo)
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా (ANI Photo)

Arvind Kejriwal Residence: ఆమ్ఆద్మీ పార్టీ (AAP), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య మరో రచ్చ మొదలైంది. తన ఇంటి పునరుద్ధరణ, సుందరీకరణ పనుల కోసం రూ.45 కోట్ల ప్రజాధనాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వాడుకున్నారని బీజేపీ ఆరోపించింది. కేజ్రీవాల్ తీవ్రమైన వంచనకు పాల్పడుతున్నారని విమర్శించింది. దీనికి ఆప్ నేత బదులిచ్చారు.

Arvind Kejriwal Residence: నిజాయితీ, సింప్లిసిటీ అంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ తన వాగ్దానాలను తప్పుతున్నారని, మోసం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా (Sambit Patra) బుధవారం విమర్శించారు. కంఫర్ట్, విలాసాలపై ఆయనకు కాంక్ష ఎక్కువ అని అన్నారు. తన ఇంటి సుందరీకరణ గురించిన వార్తను కప్పిపుచ్చేందుకు మీడియా సంస్థలకు రూ.20 కోట్ల నుంచి రూ.50కోట్ల వరకు ఇచ్చేందుకు కేజ్రీవాల్ ప్రయత్నించారని, అయితే దాన్ని ఆ సంస్థలు అంగీకరించలేదని పాత్రా చెప్పారు.

ఒక్కో కర్టన్ ధర రూ.7.94లక్షలు

Arvind Kejriwal Residence Row: కేజ్రీవాల్ ఇంటికి వియత్నాం నుంచి ఖరీదైన మార్బుల్స్, ప్రీ-ఫాబ్రికేటెడ్ ఉడెన్ వాల్స్, కర్టన్లు తెప్పించారని సంబిత్ పాత్రా అన్నారు. ఈ ఒక్కో కర్టన్ ధర రూ.7.94లక్షల కంటే ఎక్కువని ఆయన ఆరోపించారు. “ఆయన సిగ్గులేని ఓ రాజు కథ ఇది” అంటూ సంబిత్ పాత్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేజ్రీవాల్ సమాధానం చెప్పాలి

Arvind Kejriwal Residence Row: తన ఇంటి సుందరీకరణ గురించి సంధిస్తున్న ప్రతీ ప్రశ్నకు కేజ్రీవాల్ సమాధానం చెప్పాల్సిందేనని సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ విద్యార్హతపై ప్రశ్నించేందుకు మీడియా సమావేశం పెట్టినట్టే.. తన ఇంటిపై వస్తున్న ఆరోపణల గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టి జవాబు చెప్పాలని సంబిత్ పాత్రా అన్నారు.

ఆప్ ఎదురుదాడి

Arvind Kejriwal Residence Row: కేజ్రీవాల్ ఇంటి సుందరీకరణపై బీజేపీ చేసిన విమర్శలకు స్పందించారు ఆమ్ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్. “డొనాల్డ్ ట్రంప్ 3 గంటల పర్యటనకు రూ.80కోట్లు ఖర్చు చేశారు. మధ్యప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రులు.. విమానాల కోసం రూ.200 కోట్లు కేటాయించుకున్నారు. ఈ విషయాలపై చర్చించేందుకు ఎవరికీ ధైర్యం లేదు” అని ప్రియాంక కక్కర్ అన్నారు. కేజ్రీవాల్ ఉంటున్న ఇంట్లో పైకప్పు స్లాబ్ మూడుసార్లు కూలిపోయిందని, ఇంటికి మరమ్మతులు చేయాలని పీడబ్ల్యూడీనే చెప్పిందని ఆమె తెలిపారు.

కేజ్రీవాల్ ప్రస్తుతం ఉంటున్న బంగ్లా 1942లో నిర్మితమైందని, అది శిథిలావస్థలో ఉందని ప్రియాంక్ అన్నారు. ఓసారి కేజ్రీవాల్ తల్లిదండ్రులు ఉంటున్న గది పైకప్పు స్లాబ్ ఊడిపోయిందని అన్నారు. ఢిల్లీ సీఎం ఇంటి నిర్మాణ విలువ కంటే ఆరు ఎకరాల్లో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ నివాస మరమ్మతులు/పెయింటింగ్‍కే ఎక్కువ ఖర్చయిందని ప్రియాంక అన్నారు.

IPL_Entry_Point