Amritpal Singh news : పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన అమృత్ పాల్
Amritpal Singh news : ఖలిస్థానీ నేత అమృత్ పాల్ కోసం పోలీసుల అన్వేషణకు తెరపడింది ఈ వారిస్ పంజాబ్ దే చీఫ్.. పంజాబ్ పోలీసులు ఎదుట లొంగిపోయినట్టు సమాచారం.
Amritpal Singh news : నెల రోజుల పాటు పంజాబ్ పోలీసుల కంటపడకుండా తప్పించుకుని తిరిగిన.. మత ప్రబోధకుడు, ఖలీస్థానీ మద్దతుదారుడు అమృత్ పాల్ లొంగిపోయాడు. పోలీసులు అతడిని మోగా ప్రాంతంలో అరెస్ట్ చేశారు.
“పంజాబ్ మోగాలో అమృత్ పాల్‌ను అరెస్ట్ చేశాము. ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తాము. ఎలాంటి ఫేక్ న్యూస్ వ్యాపించవద్దని ప్రజలకు సూచిస్తున్నాము. ప్రజలు శాంతియుతంగా ఉండాలి,” అని పంజాబ్ పోలీస్ విభాగం ట్వీట్ చేసింది.
మోగాలో రోడ్ విలేజ్‌లోని ఓ గురుద్వారాలో పోలసులకు అమృత్ పాల్ లొంగిపోయినట్టు తెలుస్తోంది.
అమృత్ పాల్ సింగ్‌ను అసోంలోని డిబ్రుఘడ్కు తరలిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ మద్దతుదారుల్లో 8మంది.. జాతీయ భద్రతా చట్టం కింద ఇప్పటికే అక్కడి జైలులో ఉన్నారు.
Amritpal Singh arrest : అమృత్సర్ విమానాశ్రయం నుంచి లండన్‌కు తప్పించుకునే క్రమంలో పోలీసులకు దొరికిపోయింది అమృత్ పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన జరిగిన మూడు రోజులకే వారిస్ పంజాబ్ దే చీఫ్.. పోలీసులు ఎదుట లొంగిపోయాడు.
ఇదీ చదవండి:- Who is Amritpal Singh?: ఎవరీ అమృత్‍పాల్ సింగ్? తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
నెల రోజుల పాటు.. తప్పించుకుని తిరిగి!
ఖలిస్థానీ దేశం కోసం విపరీతంగా ప్రచారాలు చేస్తున్న వారిలో ఈ అమృత్ పాల్ ఒకడు. అతడికి పంజాబ్ ప్రజల్లో భారీ ఫాలోయింగ్ ఉంది! ఈ ఏడాది ఫిబ్రవరి 24న జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణ. అమృత్ పాల్ మద్దతుదారుడు, ఓ కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లవ్‌ప్రీత్ సింగ్ తూఫాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అమృత్ పాల్ మద్దతుదారులు.. భారీ కత్తులు, తుపాకులతో అంజాలా పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
Amritpal Singh latest news : అప్పటి నుంచి అమృత్ పాల్‌పై పోలీసుల ఫోకస్ పెరిగింది. ఈ క్రమంలోనే.. ఖలిస్థానీ దేశం కోసం అమృత్ పాల్ చేస్తున్న ప్రచారాలు బయటపడ్డాయి. ఫలితంగా అతడిని అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు రంగంలోకి దిగాడు. కానీ ఈ వారిస్ పంజాబ్ దే చీఫ్.. చాకచక్యంగా తప్పించుకుని మాయమైపోయేవాడు. ఉత్తరాఖండ్, హరియాణా పోలీసులు సైతం అప్రమత్తమై.. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఓవైపు అతడి కోసం అన్వేషిస్తూనే.. మరోవైపు అతడి మద్దతుదారులు, సన్నిహితులు, కుటుంబసభ్యులను విచారించడం మొదలిపెట్టారు. అతడి సమాచారం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పెద్దగా ఫలితం దక్కలేదు. చివరికి.. అతనే పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు!
సంబంధిత కథనం
టాపిక్