Amritpal’s surrender: లొంగిపోనున్న అమృత్ పాల్ సింగ్; అమృత్ సర్ లో హై అలర్ట్
Amritpal’s surrender: ఖలిస్తానీ వేర్పాటువాద నేత (Khalistan), వారిస్ పంజాబ్ దె (Waris Punjab De) చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసులకు లొంగిపోనున్నారనే వార్తల నేపథ్యంలో.. అమృత్ సర్ లో హై అలర్ట్ ప్రకటించారు.
Amritpal’s surrender: ఖలిస్తానీ (Khalistan) వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దె (Waris Punjab De) చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) అరెస్ట్ పై హై డ్రామా కొనసాగుతోంది. అమృత్ పాల్ సింగ్ బుధవారం పోలీసులకు లొంగిపోనున్నారని ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. పంజాబ్ (Punjab) లోని ఏదో ఒక ప్రముఖ సిఖ్ ప్రార్థనా స్థలం నుంచి ఆయన లొంగిపోతున్నట్లుగా ప్రకటించే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలకు విశ్వసనీయ సమాచారం అందింది.
Amritpal’s surrender: రహస్యంగా పంజాబ్ లోనే..
ఖలిస్తానీ (Khalistan) వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దె (Waris Punjab De) చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ఎక్కడున్నాడనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఉత్తరాఖండ్ లో ఉన్నాడని కొన్ని వార్తలు, నేపాల్ కు వెళ్లి పోయాడని మరికొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా, బుధవారం పంజాబ్ (Punjab) లో అమృతసర్ (Amritsar) లో ఉన్న స్వర్ణ దేవాలయం (Golden Temple) నుంచి ఆయన (Amritpal Singh) లొంగిపోతున్నట్లు ప్రకటన చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇంటలిజెన్స్ వర్గాలకు కూడా పక్కా సమాచారం అందింది.
Amritpal’s surrender: స్త్రీ వేషం వేసుకుని..
ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వారిస్ దె పంజాబ్ చీప్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) పంజాబ్ లోని ఏ ప్రార్థన స్థలం నుంచి లొంగిపోతారనే విషయంపై ఉత్కంఠ నెలకొన్నది. అమృతసర్ (Amritsar) లోని స్వర్ణదేవాలయం (Golden Temple) నుంచి ఆయన లొంగిపోయే అవకాశముందని పోలీసులు, నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దాంతో, అమృతసర్ (Amritsar) లో హై అలర్ట్ ప్రకటించారు. నగరంలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. స్వర్ణ దేవాలయం (Golden Temple) పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్పెషల్ ఇంటలిజెన్స్ టీమ్స్ రంగంలోకి దిగాయి. అలాగే, భటిండాలోని తల్వండి సాబో, ఆనంద్ పూర్ సాహిబ్ పరిసరాల్లోనూ భారీగా బలగాలు మోహరించాయి. అక్కడి వ్యక్తుల కదలికలపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) మారు వేషంలో, అదికూడా స్త్రీ వేషంలో ఆ దేవాలయాల లోపలికి వెళ్లే అవకాశముందని సమాచారం రావడంతో, ఆయా ఆలయాల లోపలికి వెళ్లే వారిని వేయి కళ్లతో పరిశీలిస్తున్నారు. పంజాబ్ (Punjab) లోని ఫగ్వారా సమీపంలోని ఒక గ్రామంలో అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ఉన్నట్లు మంగళవారం పక్కా సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన పోలీసుల కళ్లు గప్పి పారిపోగలిగాడు. ప్రస్తుతం ఆయన జలంధర్ సమీపంలో ఎక్కడైనా ఉండొచ్చని భావిస్తున్నారు. దాంతో, జలంధర్ లో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.