Karnataka polls : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్​ హిట్​.. బీజేపీ డీలా!-karnataka polls 2023 pre poll survey shows clear win for cong bjp calls it bogus ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Polls : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్​ హిట్​.. బీజేపీ డీలా!

Karnataka polls : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్​ హిట్​.. బీజేపీ డీలా!

Sharath Chitturi HT Telugu
Apr 30, 2023 08:30 AM IST

Karnataka polls : కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన సర్వేలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. తాజాగా వెలువడిన ఓ సర్వే ప్రకారం.. ఇక్కడ కాంగ్రెస్​ ఘన విజయం సాధిస్తుంది!

కర్ణాటకలో ప్రధాని మోదీ రోడ్​ షో..
కర్ణాటకలో ప్రధాని మోదీ రోడ్​ షో..

2023 Karnataka election : కర్ణాటకలో ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అగ్రనేతల పర్యటనలు, హామీలు, మాటల యుద్ధాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ఎన్నికల ఫలితాలపై జరిపిన సర్వేలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. 2023 కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని, కాంగ్రెస్​ ఘన విజయం సాధిస్తుందని "ఈదిన" మీడియా సర్వే పేర్కొంది.

ఈదిన ప్రీ- పోల్​ సర్వే..

సర్వే ప్రకారం.. 224 అసెంబ్లీ సీట్లల్లో కాంగ్రెస్​కు 134-140 స్థానాల్లో విజయం దక్కుతుంది. బీజేపీ మాత్రం 57-65 సీట్లతో సరిపెట్టుకుంటుంది. ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్​కు 43శాతం ఓటు షేరు లభిస్తుంది.. బీజేపీకి 33శాతమే ఓటు షేరు ఉంటుంది.

Surveys on Karnataka election : 2018లో కాంగ్రెస్​కు 80 సీట్లు వచ్చాయి. నాటి ఎన్నికల్లో 104 సీట్లల్లో విజయంతో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కాంగ్రెస్​- జేడీఎస్​లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కొంత కాలం తర్వాత ప్రభుత్వం కుప్పకూలింది. చివరికి బీజేపీ అధికారంలోకి వచ్చింది.

ఇదీ చూడండి:- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. గెలుపెవరిది? ప్రజలు ఎవరి పక్షం?

తాజా ఈదిన సర్వే ప్రకారం.. హైదరాబాద్​ కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్​ 31-37 సీట్లు గెలుస్తుంది. ముంబై కర్ణాటకలో 40-46 స్థానాలు దక్కించుకుంటుంది. దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లోని 26-32 సీట్లు కాంగ్రెస్​ వసమవుతాయి. బెంగళూరులోని 16-20 సీట్లు కాంగ్రెస్​నే వరిస్తాయి. మరోవైపు హైదరాబాద్​ కర్ణాటక ప్రాంతంలో బీజేపీ 2-3 సీట్లకే పరిమితమవుతుంది. కర్ణాటక తీర ప్రాంతంలో 10-14 సీట్లు రావొచ్చు. ఇక్కడ కాంగ్రెస్​కు 5-9 స్థానాల్లో విజయం దక్కుతుంది. సెంట్రల్​ కర్ణాటకలో బీజేపీకి 19-23 సీట్లు వస్తే.. కాంగ్రెస్​ కేవలం 3-4 స్థానాల్లో గెలుస్తుంది.

బీజేపీ ఆరోపణలు..

Karnataka election 2023 schedule : ఈదిన సర్వేను బీజేపీ ఖండించింది. ఇదొక బోగస్​ పోల్​ అని ఆరోపించింది. ఇది సర్వే కాదని, కొందరు కావాలని రాసిన నెంబర్లను మండిపడింది.

మరో సర్వే కూడా..!

ఇటీవలే వెలువడిన సీఓటర్​ సర్వే సైతం కాంగ్రెస్​ గెలుపు ఖాయమని పేర్కొంది! ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్​కు 115-127 సీట్లు దక్కుతాయి. బీజేపీ 60-80 సీట్లల్లో గెలుస్తుంది. కింగ్​ మేకర్​గా అవతరించి, మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలు కంటున్న జేడీఎస్​కు 23-35 సీట్లే వస్తాయి!

కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 13 ఫలితాలు వెలువడనున్నాయి. మరి ఈ సర్వేలు చెబుతున్నది నిజమవుతుందా? కాంగ్రెస్​ గెలుస్తుందా? లేక ఈసారి కూడా బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానం మరి కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం